న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఫ్యాన్స్ దెబ్బకు ఎక్కడికో వెళ్లిన లీసెస్టర్‌షైర్ యూట్యూబ్ ఛానల్

Leicestershire YouTube channel reaching 150K subscribers after live telecast the Indias match

లండన్: ఇంగ్లాండ్‌లో జులై 1వ తేదీన ఆరంభం కానున్న టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్.. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను తీవ్ర ప్రభావితం చేసింది. నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌ను ఆ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోండటం వల్ల సబ్‌స్క్రిప్షన్ ఒక్కసారిగా పెరిగింది. లక్షన్నరను దాటేసింది. భారత అభిమానులే వేల సంఖ్యలో ఉన్నారు. కొత్త సబ్‌స్క్రిప్షన్ పొందిన వారంతా భారత్‌కు చెందిన క్రికెట్ అభిమానులే.

ఓపెనర్‌గా కేఎస్ భరత్..

లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌‌తో ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోన్న విషయం తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్‌లో ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మకు బదులుగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైజాగ్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ 31 పరుగులు, వన్ డౌన్ బ్యాటర్, కాకినాడకు చెందిన హనుమ విహారి-9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కేఎస్ భరత్ ఇన్నింగ్‌లో అయిదు ఫోర్లు నమోదయ్యాయి.

244 పరుగులకు..

మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 34 బంతుల్లో 38 పరుగులు చేసిన అవుట్ అయ్యాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. నవ్‌దీప్ సైని బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. లీసెస్టర్‌షైర్ జట్టు తరఫున నాలుగు ఓవర్లను సంధించిన నవ్‌దీప్ సైనీ 12 పరుగులు ఇచ్చిన ఒక వికెట్ తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగుల వద్ద ఇన్నింగ్ డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్‌లో లీసెస్టర్‌షైర్ 244 పరుగులు చేసింది.

ఎగబడి చూస్తోన్న ఫ్యాన్స్..

రిషభ్ పంత్ 76 పరుగులు చేశాడు. ఆ జట్టులో అతనే టాప్ స్కోరర్. ఓపెనర్ లూయిస్ కింబర్-31, రిషి పటేల్-34, రొమన్ వాకర్-34, జోయ్ ఎవిసన్-22, నాథన్ బౌలీ-17 పరుగులు చేశారు. 244 పరుగులకు లీసెస్టర్‌షైర్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లల్లో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ మూడు, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఉమేష్ యాదవ్ వికెట్ లెస్‌గా మిగిలాడు. కాగా.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కాస్తా రసవత్తరంగా సాగుతుండటంతో అభిమానులు ఎగబడి చూస్తోన్నారు.

ఎక్కడికో వెళ్లిన యూట్యూబ్ ఛానల్..

లీసెస్టర్‌షైర్ జట్టులో కూడా టీమిండియా ప్లేయర్లు ఉండటం వల్ల మ్యాచ్‌ను వదలట్లేదు. దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ఫాక్సెస్‌ను భారీగా సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆరంభం కావడానికి ముందు 47,000 వరకు ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రిప్షన్ సంఖ్య.. రెండో రోజు చేరుకునేటప్పటికీ 1,56,000లకు చేరుకుంది. దీనితో లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకొంది. భారత క్రికెట్ అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

Story first published: Saturday, June 25, 2022, 11:27 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X