న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Legends League Cricket: ఆడ పిల్లల చదవు కోసం కపిల్ దేవ్‌తో చేతులు కలిపిన అలనాటి ఆటగాళ్లు!

Legends League Cricket, Kapil Devs Foundation join hands to support girl child education

న్యూఢిల్లీ: బాలికల చదువు కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్, దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్ చేతులు కలిపాయి. లెజెండ్స్ లీగ్ ప్రారంభానికి ముందు ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెప్టెంబర్ 16న ఇండియా మహారాజస్, వరల్డ్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట సంబరాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగానే బీసీసీఐ ఇండియా మహారాజస్, వరల్డ్ జెయింట్స్ మ్యాచ్ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా సేకరించనున్న నిధులను బాలికల చదువు కోసం ఖర్చు చేయనున్నారు.

కపిల్ దేవ్ చేతుల మీదుగా..

కపిల్ దేవ్ చేతుల మీదుగా..

2003లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రారంభించిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్.. దేశంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలను స్కూళ్లకు పంపించడంలో ఖుషి ఫౌండేషన్ సక్సెస్ అయ్యింది. గత 17 ఏళ్లలో సుమారు 15 లక్షల పిల్లల జీవితాలను మార్చింది. పేదరికంతో ఉన్నత చదువులు చదవలేని బాలికలు, యువతులకు ఈ ఫౌండేషన్ అండగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా బాలికల విద్య కోసం పాటుపడుతోంది.

సంతోషంగా ఉందబ్బా..

సంతోషంగా ఉందబ్బా..

ఖుషి ఫౌండేషన్‌కు లెజెండ్స్ లీగ్ క్రికెట్ అండగా నిలవడంపై కపిల్ దేవ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఖుషి స్వచ్చంద సంస్థ మనందరిది. భారత్‌లోని బాలికల కోసం మేం చాలా చేయాలనుకుంటున్నాం. మా ప్రయత్నానికి దిగ్గజ ఆటగాళ్లంతా అండగా నిలవడం సంతోషకరం. ఇలాంటి మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ముందుకు రావడం ప్రశంసించదగిని విషయం.

దేశంలోని ఆడపిల్లల కోసం మనమంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖుషి స్వచ్చంద సంస్థ ద్వారా మేం ఇప్పటికే 12 రాష్ట్రాల్లోని 46 వేల మంది పిల్లలకు విద్యను అందిస్తూ వారి జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పటికే చాలా చేశాం.. ఇంకా చేయాల్సి ఉంది'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

అలరించడమే కాదు.. అండగా ఉంటాం..

క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ లక్ష్యానికి సాయం అందించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని లెజెండ్స్ లీగ్ ఫౌండర్ వివేక్ ఖుషాలని తెలిపారు. 'ఖుషి ఫౌండేషన్‌కు లెజెండ్స్ లీగ్ క్రికెట్ అండగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పేందుకు మేం సంతోషపడుతున్నాం. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న ఖుషి లాంటి స్వచ్చంద సంస్థకు ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం దక్కడం, కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్ లక్ష్య సాధనలో భాగం కావడం మాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రేక్షకులను అలరించడమే మా లక్ష్యం కాదు. సమాజంలో మార్పు తెచ్చేందుకు కూడా మా వంతు సాయం చేస్తాం.'అని వివేక్ పేర్కొన్నారు.

ఆరు వేదికల్లో మ్యాచ్‌లు..

ఆరు వేదికల్లో మ్యాచ్‌లు..

లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండో సీజన్‌తో వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో అభిమానులను అలరించేందుకు అలనాటి ఆటగాళ్లు సిద్దమవుతున్నారు. టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్‌లో పోటీ పడేందుకు రెడీ అయ్యారు. ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా చారిటీ మ్యాచ్ జరగనుండగా.. సెప్టెంబర్ 17న అసలు సిసలు మ్యాచ్ షురూ కానుంది. మొత్తం ఆరు వేదికల్లో అక్టోబర్ 8 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Story first published: Tuesday, August 30, 2022, 19:51 [IST]
Other articles published on Aug 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X