న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1890లో నిర్మాణం: 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలిసారి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోన్న స్టేడియం!

Leeds hosts its first Cricket World Cup 19 as England Vs Sri Lanka

లండ‌న్‌: ప్ర‌స్తుతం ఇంగ్లండ్ వేదిక‌గా కొన‌సాగుతోన్న ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ మెగా టోర్న‌మెంట్ కోసం మొట్ట‌మొద‌టి సారి ముస్తాబైంది లీడ్స్‌. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలిసారిగా ఇక్క‌డ మ్యాచ్ ఆడ‌బోతుండ‌టం ఇదే తొలిసారి. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో మూడో అతి పెద్ద న‌గ‌రంగా లీడ్స్‌కు గుర్తింపు ఉంది. అటు లండ‌న్‌కు ఇటు ఎడిన్‌బ‌ర్గ్‌కు స‌మాన‌దూరంలో ఉంటుందీ సిటీ. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా క్రికెట్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌, శ్రీలంక మ‌ధ్య లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వ‌హిస్తున్నారు.

1890లో నిర్మించిన స్టేడియం..
లీడ్స్ న‌గ‌ర శివార్ల‌లో హెడింగ్లే స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియం ఇప్ప‌టిది కాదు. 1890లో ఈ స్టేడియం రూపుదిద్దుకుంది. ఈ స్టేడియం సామ‌ర్థ్యం 17 వేలు. ఇందులో మొట్ట‌మొద‌టి ఆరిగా 1899లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్‌ను నిర్వ‌హించారు. 1973లో మొద‌టిసారిగా వ‌న్డే మ్యాచ్‌కు అతిథ్యాన్ని ఇచ్చింది ఈ స్టేడియం. ఇంగ్లండ్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య తొలిసారిగా వ‌న్డే మ్యాచ్‌ను ఇక్క‌డ నిర్వ‌హించారు.

టీమిండియాస్ డే అవుట్‌! పిల్ల‌ల‌తో పిల్ల‌లుగా.. స‌ర‌దాగా!టీమిండియాస్ డే అవుట్‌! పిల్ల‌ల‌తో పిల్ల‌లుగా.. స‌ర‌దాగా!

ఈ స్టేడియంలో ఇంగ్లండ్ టీమ్‌కు మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది మేలో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 351 ప‌రుగుల భారీ స్కోరును న‌మోదు చేసింది. ఇప్ప‌టిదాకా మొత్తం 42 వ‌న్డే మ్యాచ్‌ల‌కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా.. అందులో ఒక్క‌టి కూడా ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగమై లేదు. ఈ 42 మ్యాచ్‌ల‌ల్లో ఛేజింగ్ టీమ్ 24 సార్లు గెలిచింది. ఫ‌స్ట్ ఇన్నింగ్ స‌గ‌టు స్కోరు 226 ప‌రుగులు కాగా.. సెకెండ్ ఇన్నింగ్ స‌గ‌టు స్కోర్ 207.

Story first published: Friday, June 21, 2019, 14:02 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X