42ఏళ్ల వయసులో పేస్ అలా, నేను ఎంతో కొంత క్రికెట్‌ ఆడలేనా?: శ్రీశాంత్

Supreme Court Has Given Me A Lifeline Says Sreesanth | Oneindia Telugu
Leander won Grand Slams at 42, I can at least still play some cricket, Sreesanth

హైదరాబాద్: "42 ఏళ్ల వయసులో లియాండర్‌ పేస్‌ గ్రాండ్‌శ్లామ్‌ గెలిచినప్పుడు 36 ఏళ్ల వయసులో నేను ఎంతో కొంత క్రికెట్‌ ఆడగలను" అని టీమిండియా పేసర్ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌కు శుక్రవారం సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించిన సంగతి తెలిసిందే.

సీఓఏతో మాట్లాడా: పరస్పర విరుద్ధ ప్రయోజనాలేవన్న గంగూలీ

బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా ధర్మాసనం అభివర్ణించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని బీసీసీఐని ధర్మాసనం ఆదేశించింది.

తనపై విధించిన జీవితకాల నిషేధా

తనపై విధించిన జీవితకాల నిషేధా

బీసీసీఐ తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసిన నేపథ్యంలో శ్రీశాంత్ ప్రముఖ వార్తాసంస్థ పీటీఐతో మాట్లాడుతూ "సుప్రీం తీర్పు నేపథ్యంలో నాకు ఇకపై ఎలాంటి జీవితం దక్కనుందో తెలీదు. సుప్రీం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నా. క్రికెట్‌ మైదానంలోని మళ్లీ నన్ను అనుమతిస్తుందని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను పాఠశాల క్రికెట్‌ మైదానానికి వెళ్లగలను. నాకెంత వీలైతే అంత క్రికెట్‌ను ఆడగలను" అని అన్నాడు.

అత్తమామలకు శ్రీశాంత్ ధన్యవాదాలు

అత్తమామలకు శ్రీశాంత్ ధన్యవాదాలు

ప్రపంచం మొత్తం తనను అవమానించిన వేళ అండగా నిలిచిన అత్తమామలకు శ్రీశాంత్ ధన్యవాదాలు తెలిపాడు. "నా అత్తమామలకు ధన్యవాదాలు చెబుతున్నా. ప్రపంచం నన్ను అనుమానించిన వేళ వారు నన్ను నమ్మారు. కూతుర్ని నాకిచ్చి పెళ్లిచేశారు. కష్టకాలంలో నా తల్లిదండ్రులు నాకు అండగా ఉన్నారు. క్లిష్ట సమయాల్లో నన్ను నమ్మడం అంత సులువు కాదు" అని శ్రీశాంత్ అన్నాడు.

వీరూ భాయ్, సురేశ్‌ (రైనా) నాతో టచ్‌లోనే

వీరూ భాయ్, సురేశ్‌ (రైనా) నాతో టచ్‌లోనే

"అవును, నాతో కలిసి క్రికెట్‌ ఆడిన వారి నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. వాట్సప్‌ మేసేజ్‌లు పంపారు. భజ్జు పా (హర్భజన్‌సింగ్‌) నాతో మాట్లాడాడు. వీరూ భాయ్, సురేశ్‌ (రైనా) నాతో టచ్‌లోనే ఉన్నారు. నా మిత్రుడు రాబిన్‌ ఊతప్పతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా" అని శ్రీశాంత్ తెలిపాడు.

నా పిల్లలకు ఏం చెప్పాలా అని ఆలోచించేవాడిని

నా పిల్లలకు ఏం చెప్పాలా అని ఆలోచించేవాడిని

"ఇంతకాలం, నేను నా పిల్లలకు ఏం చెప్పాలా అని ఆలోచించేవాడిని. ఒక తండ్రిగా నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించేవాడిని. ఇప్పుడు నాకు ఆ బెంగ లేదు. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత కష్ట సమయంలో పోరాటం వదలకపోవడమే తమ తండ్రి బలమని చెప్తాను" అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ధీటుగా

నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ధీటుగా

"నేను జైలుకు వెళ్లానని, గడ్డు కాలం గడిపాడని, నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ధీటుగా ఎదుర్కొని తిరిగొచ్చానని వారు తెలుసుకుంటారు. నా స్టోరీ నుంచి వారు శక్తిని పొందుతారు" అని శ్రీశాంత్‌ చెప్పాడు. భారత క్రికెట్‌లో శ్రీశాంత్ ఎదుర్కొన్న కష్టాలకు స్వీడీష్‌కు డీజే కంపోజ్ చేసిన 'రైజ్ అప్' అనే పాట చక్కగా సరిపోతుంది.

శ్రీశాంత్ జీవితం యొక్క నినాదం ఇదే!

శ్రీశాంత్ జీవితం యొక్క నినాదం ఇదే!

"Rise up!

Don't fall down again

Rise up

Long time I broke the chains

I try to fly a while so high

Direction - sky".

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, March 15, 2019, 17:25 [IST]
Other articles published on Mar 15, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more