మాంఛెస్టర్: భారత లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ఉన్నట్టుండి మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం స్టాండ్స్‌లో ప్రత్యక్షం అయ్యారు. నల్లరంగు జెర్కిన్ ధరించి, స్టేడియం పాస్ ఉన్న ట్యాగ్‌ను మెడలో వేసుకుని స్టేడియం వీఐపీ స్టాండ్స్‌లో సందడి చేస్తూ కనిపించారు లియాండర్ పేస్. కమాన్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్థసెంచరీలు సాధించినప్పుడు, వారిద్దరు భారీ షాట్లు ఆడినప్పుడు లియాండర్ పేస్ సాధారణ ప్రేక్షకుడిలా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.
2015 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన తరువాత లియాండర్ పేస్ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. చాలాకాలం తరువాత మీడియా కంట పడ్డారు. టెన్నిస్ ప్లేయర్‌గా తాను తీరిక లేకుండా గడిపిన రోజులు, సందర్భాలు ఉన్నాయని, అప్పట్లో ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్‌ను చూడాలనుకున్నప్పటికీ కుదరలేదని అన్నారు. ప్రస్తుతం తనకు దొరికిన కొద్దిపాటి సమయంలో- మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి మాంఛెస్టర్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను స్టేడియంలో, ప్రేక్షకుల మధ్య చూడాలని తాను ఎప్పటి నుంచో కోరికగా ఉందని, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
{headtohead_cricket_3_5}