న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేలకు రిటైర్మెంట్‌ .. మలింగ రికార్డులు ఇవే!!

Lasith Malinga Retires:Malinga Records In His Remarkable ODI Career
Lasith Malinga retires from ODIS: Look at all the records in his remarkable ODI career

కొలంబో: ప్రత్యేకమైన బౌలింగ్ శైలి, యార్కర్లతో 15ఏళ్లుగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు మలింగ ఆడుతాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

చివరి బంతికి కూడా వికెట్:

చివరి బంతికి కూడా వికెట్:

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి మలింగకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్‌లో మలింగ 9.4 ఓవర్లు వేసి కేవలం 38 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్‌.. ముస్తాఫిజుర్ రెహమాన్ వికెట్లను పడగొట్టాడు. వన్డే కెరీర్ చివరి బంతికి కూడా వికెట్ తీయడం విశేషం.

226 వన్డేలు 338 వికెట్లు:

226 వన్డేలు 338 వికెట్లు:

2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున మురళీధరన్ (534), వాస్ (400) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు.

 నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:

నాలుగు బంతులు.. నాలుగు వికెట్లు:

కరీబియన్ దీవుల్లో జరిగిన 2007 ప్రపంచకప్‌లో మలింగ అద్భుతం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జార్జ్ టౌన్‌లోని ప్రావిడెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు.

మలింగ రికార్డులు:

మలింగ రికార్డులు:

# పంచకప్‌లో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక ఆటగాడు మలింగ. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్‌లు చేసిన ఆటగాళ్లు మలింగ, వసీమ్‌ అక్రమ్‌ మాత్రమే.

# మలింగ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఈ రికార్డు అందుకోలేదు.

# శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ మలింగ (338). ముత్తయ్య మురళీధరన్ (523), చమింద వాస్‌ (399)లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

# ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు మలింగ. 29 మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టాడు. మెక్‌గ్రాత్‌ (71), ముత్తయ్య మురళీధరన్‌ (68) ముందున్నారు.

# ప్రపంచకప్‌-2019లో మలింగ 13 వికెట్లు పడగొట్టి శ్రీలంక తరఫున టాప్‌ బౌలర్‌గా నిలిచాడు.

# శ్రీలంక తరఫున బౌలింగ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ (32.4)ను కలిగి ఉన్న రెండో బౌలర్‌ మలింగనే. అజంతా మెండిస్‌ తొలి స్థానంలో ఉన్నాడు.

# శ్రీలంక తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అర్ధ శతకం బాదాడు.

Story first published: Saturday, July 27, 2019, 16:00 [IST]
Other articles published on Jul 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X