న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశ్రాంతి లేకుండానే 2 మ్యాచ్‌లు.. మలింగ సూపర్ షో

IPL 2019 : Malinga Collects 10/83 Across Two Games In Two Days || Oneindia Telugu
Lasith Malinga collects 10/83 across two games in two days

యార్కర్లు అనగానే క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీలంక ఫాస్ట్‌బౌలర్‌ లసిత్‌ మలింగ. ఫాస్ట్‌బౌలర్‌ అంటే మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య తప్పనిసరిగా విరామం తీసుకుంటారు. విశ్రాంతి ఉంటే తప్ప ప్రాక్టీస్‌కు కూడా ఆటగాళ్లు హాజరుకాకపోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మలింగ మాత్రం ఎలాంటి విరామం లేకుండానే రెండు మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసి తమ జట్లకు విజయాలను అందించాడు.

4 ఓవర్లు 3 వికెట్లు:

4 ఓవర్లు 3 వికెట్లు:

వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మలింగ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. వాట్సన్ , జాదవ్, బ్రేవో వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ ముగిసే సరికి అర్ధరాత్రి అయింది.

49 పరుగులు 7 వికెట్లు:

49 పరుగులు 7 వికెట్లు:

ఐపీఎల్ మ్యాచ్ అనంతరం మలింగ రాత్రి 1.40కి బయల్దేరి గురువారం ఉదయం 4.30కి శ్రీలంక చేరుకొన్నాడు. ఉదయం 7 గంటలకు వన్డే సూపర్‌ ఫోర్‌ ప్రొవిన్షియల్‌ టోర్నీలో ఆడాడు. మలింగ గాలే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాండీతో జరిగిన ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. మలింగ 49 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయడంతో గాలే జట్టు 156 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అర్ధంతరంగా నిష్క్రమణ:

అర్ధంతరంగా నిష్క్రమణ:

తొలుత మలింగకు ఐపీఎల్‌లో ఆడేందుకు శ్రీలంక బోర్డు అనుమతి ఇచ్చింది. తాజాగా మళ్లీ దేశవాళీ టోర్నీ కోసం స్వదేశానికి రమ్మని కబురు పంపింది. దీంతో మలింగ ఐపీఎల్‌ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన 12 గంటల్లోపే గాలే మ్యాచ్‌ ఆరంభం అయింది. ఒక ఆటగాడు వరుసగా రెండు రోజుల్లో రెండు వేర్వేరు దేశాల్లో మ్యాచ్‌లు ఆడటం అరుదైన విషయం. రెండు రోజులలో మలింగ 10 వికెట్లు తీసి 83 పరుగులు ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో మలింగ వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఎంపికయితే నాలుగోసారి వరల్డ్‌కప్‌లో ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Story first published: Friday, April 5, 2019, 11:52 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X