న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్

Lance Klusener Praises Hardik Pandya Skills And Says If Pandya is There Then The Team is Different

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. 28ఏళ్ల పాండ్యా ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు భారత జట్టు వేరే రేంజులో ఉంటుందన్నాడు. ఈ ఏడాది భారత్‌ తరఫున ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో పాండ్యా ఒకడు. గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు అరంగేట్ర సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. తర్వాత భారత్ తరఫున దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో జరిగిన సిరీస్‌లలోనూ మంచి ఫామ్‌ కనబర్చిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనలో తన కెరీర్‌లో తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించి విజయవంతం అయ్యాడు.

 తిరిగి బౌలింగ్ ప్రారంభించిన పాండ్యా

తిరిగి బౌలింగ్ ప్రారంభించిన పాండ్యా

కొన్నాళ్ల పాటు వెన్ను గాయం వల్ల బౌలింగ్‌కు దూరమైన హార్దిక్.. తిరిగి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. యూఏఈలో ఆసియా కప్, ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ టైంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ విభాగంలో మంచి సమతుల్యతను అందించగలడు. ఇకపోతే ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ టీంకు బ్యాటింగ్ కోచ్‌గా క్లూసెనర్ పనిచేస్తున్నాడు. రాబోయే వన్డే సిరీస్‌కు ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన క్లూసెనర్ పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు. ఏ టీంకైనా పాండ్యా లాంటి ప్లేయర్ అవసరమని, అతను మంచి ఫామ్‌లోకి తిరిగి రావడం పట్ల ఆనందంగా ఉందని, పాండ్యాతో కూడిన భారత జట్టు పూర్తిగా భిన్నమైనదని క్లూసెనర్ చెప్పాడు.

 హార్దిక్ ఉంటే వేరేగా ఉంటుంది

హార్దిక్ ఉంటే వేరేగా ఉంటుంది

‘హార్దిక్ పాండ్యా వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టులో ఉంటే ఆ జట్టుకు కాస్త ఎడ్జ్ ఉంటుంది. అతను తిరిగి జట్టులోకి రావడం, తనదైన ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం. హార్దిక్ తుది జట్టులో ఉంటే భారత జట్టు చాలా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పాండ్యా ఫుల్ ఫ్లోలో ఉన్నాడు' అని క్లూసెనర్ చెప్పాడు. భారత్‌తో జరగనున్న సిరీస్ గురించి మాట్లాడుతూ.. జింబాబ్వే జట్టుకు ఇది మంచి ప్రాక్టీస్ అవుతుందని, ఆటగాళ్లు అంతర్జాతీయ హై స్థాయి ఆటను నేర్చుకునేందుకు, ఎదగడానికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుందని క్లూసెనర్ అన్నాడు.

Rishabh Pant Hails Hardik Pandya and Dinesh Karthik *Cricket | Telugu OneIndia
వన్డే క్రికెట్లో ఇలాంటివి కూడా జరుగుతాయా అని..

వన్డే క్రికెట్లో ఇలాంటివి కూడా జరుగుతాయా అని..

‘మేం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. జింబాబ్వే లాంటి జట్టు భారత్ లాంటి అగ్రశ్రేణి జట్టుతో ఆడడం జింబాబ్వేకు గొప్ప ప్రాక్టీసు. ఇది మా జట్టుకు గొప్ప సవాలు. మా ప్లేయర్లు మరింత నేర్చుకుంటారు. మరింత ఎదగగలరు. మేము మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాము. అలాగే భారత్ కూడా తమ అసలైన గేమ్ ఆడాలని ఆశిస్తున్నాము. ఆ జట్టు తీవ్రమైన డెప్త్ కలిగి ఉంది. భారత్ తమ అసలు సిసలు ఆటను కనబరిస్తే.. మా జట్టు కంటే భారత్ అందనంత బలమైనదే. మాకు భారత్ నుంచి అలాంటి ఆట కావాలి. ఒకవేళ మా జట్టు బాగా ఆడి వారిని ఒత్తిడికి గురిచేస్తే.. వన్డే క్రికెట్‌లో ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోకమానరు' అని క్లూసెనర్ అన్నాడు.

Story first published: Tuesday, August 16, 2022, 15:48 [IST]
Other articles published on Aug 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X