న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs RCB: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్‌ చరిత్ర.. సచిన్‌ రికార్డు బ్రేక్‌!!

KXIP vs RCB: KL Rahul breaks Sachin Tendulkar’s massive record
IPL 2020 : KL Rahul Breaks Sachin's Record With Fastest 2000 IPL Runs || Oneindia Telugu

దుబాయ్‌: ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌.. నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ 20 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ ఆచితూచి ఆడుతున్నాడు. 36 బంతుల్లో 50 రన్స్ చేశాడు. 7 బౌండరీలు, ఒక సిక్స్ బాదాడు. రాహుల్‌కు ఇది 17వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. రాహుల్ తనదైన శైలిలో ఆడుతున్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా 2వేల పరుగుల మార్క్‌ను అతడు అందుకున్నాడు. అత్యంత వేగంగా 2వేల పరుగులు చేసిన రికార్డు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును రాహుల్ తన పేరుపై లికించుకున్నాడు. సచిన్ 63 ఇన్నింగ్స్‌లలో 2వేల పరుగులు చేయగా.. రాహుల్ 60 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాదించాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కూడా అరుదైన మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో 74 రన్స్ చేస్తే క్యాష్ రిచ్ లీగ్‌లో 5500 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలానే టీ20ల్లో 9 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఏబీ డివిలియర్స్ ఒక్క సిక్స్ కొడితే టీ20ల్లో 400 సిక్సుల క్లబ్‌లో చేరతాడు. ఇప్పటి వరకూ ఐదుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రాహుల్‌, మయాంక్‌ వికెట్‌ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు. ఓపెనింగ్‌ జోడీ సింగిల్స్‌ తీస్తూ స్కోర్‌ను ముందుకు నడిపించారు. ఆరు ఓవర్లకు పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఆ తరువాతి ఓవర్లో మయాంక్‌ (26) పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్ అండతో రాహుల్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేశాడు. 14వ ఓవర్ మొదటి బంతికి పూరన్ (17) ఔట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. రాహుల్ ‌(63), మ్యాక్సీ (2) క్రీజులో ఉన్నారు.

IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌కు శుభవార్త.. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు!!IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌కు శుభవార్త.. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు!!

Story first published: Thursday, September 24, 2020, 20:48 [IST]
Other articles published on Sep 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X