న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుంబ్లేను ఛీఫ్ సెలక్టర్‌గా చేసి రూ. కోటి వేతనమివ్వాలి: సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kumble Should Be Chairman Of Selectors : Virender Sehwag || Oneindia Telugu
Kumble should be chairman of selectors but BCCI needs to raise pay: Sehwag

హైదరాబాద్: ఛీఫ్ సెలక్టర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేని నియమించాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే మనోధైర్యం నింపగలడని 'ది సెలక్టర్' అనే కొత్త యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

<strong>పీకేఎల్ 2019: 4వ వారంలో చోటు చేసుకున్న టాప్-10 రైడ్స్ మీకోసం.. </strong>పీకేఎల్ 2019: 4వ వారంలో చోటు చేసుకున్న టాప్-10 రైడ్స్ మీకోసం..

చీఫ్ సెలక్టర్‌ పదవికి కుంబ్లే అన్ని విధాలా అర్హుడని సెహ్వాగ్ అన్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ "కుంబ్లే సెలక్టర్ల ఛైర్మన్ పదవికి సరైన అభ్యర్థి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లతో మంచి అనుబంధం ఉంది. కోచ్‌గా ఆటగాళ్లతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి" అని అన్నాడు.

"2007-08 ఆస్ట్రేలియా సిరీస్ అప్పుడు అనిల్ కుంబ్లే మా కెప్టెన్. ఆ సమయంలో నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. రెండు సిరీస్‌ల వరకూ నువ్వు జట్టులోనే ఉంటావు అని అన్నాడు" ఆ మాటలు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కుంబ్లే చీఫ్ సెలక్టర్‌ను చేసి అతని వేతనం కూడా పెంచాలని సెహ్వాగ్ బీసీసీఐని కోరాడు.

"ప్రస్తుతం ఛైర్మన్‌కి ఏడాదికి రూ.కోటి చెల్లిస్తున్నారు. దీనిని పెంచకుంటే కుంబ్లే ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చెప్పట్టేందుకు ఒప్పుకోరు" అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఉన్న చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌పై ఈ మధ్యకాలంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

<strong>ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే</strong>ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో జట్టు ఎంపికలో ఎమ్మెస్కే ప్రసాద్‌పై అభిమానులు మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.

Story first published: Wednesday, August 21, 2019, 19:21 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X