జో రూట్ కోసం ఆసీస్ పర్యటనలోనే ప్లాన్ రెడీ చేశా: కుల్దీప్ యాదవ్

Ind vs Eng 2021 : Developed Plan To Dismiss England Captain Joe Root - Kuldeep Yadav

చెన్నై: ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఆ జట్టు కెప్టెన్ జోరూట్‌ను ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియాలోనే ప్రణాళికలను రచించానని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌‌తో కలిసి జోరూట్‌ను అడ్డుకునేందు వ్యూహాలు సిద్దం చేశానన్నాడు. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి చెన్నై వేదికగా ఫస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫోతో మాట్లాడిన కుల్దీప్ ఈ సిరీస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆసీస్ పర్యటనలో నాథన్ లయన్‌‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నాడు.

 చిరునవ్వుతో ఆస్వాదించమన్నాడు..

చిరునవ్వుతో ఆస్వాదించమన్నాడు..

‘ఆసీస్ పర్యటనలో నాథన్ లయన్‌తో చాలా మాట్లాడాను. అతని బౌలింగ్‌ రోటిన్స్ గురించి అడిగినప్పుడు.. సాధారణ డ్రిల్స్ మెయింటేన్ చేస్తున్నానని, అతని నైపుణ్యాలు, బౌలింగ్ బలం, స్పిన్ చేసేటప్పుడు బంతిపై వేళ్లను ఎలా కదుపుతాననే విషయాలను నాతో పంచుకున్నాడు. నన్ను కూడా నా రోటిన్స్‌ను ఫాలో అవుతూ బంతి పిచ్ చేసే ప్లేస్‌ను కనుగోమన్నాడు. అంతేకాకుండా చిరునవ్వుతో బౌలింగ్‌ను ఆస్వాదించమని సూచించాడు.

అశ్విన్‌తో వ్యూహాలు రచించా..

అశ్విన్‌తో వ్యూహాలు రచించా..

అశ్విన్ కూడా నాకు చాలా ఐడియాలు ఇచ్చాడు. కొన్ని సమయాల్లో నా రిథమ్‌ను వేగవంతం చేయాలని, స్ట్రెయిట్‌గా బంతులు వేయాలని, అప్పుడప్పుడూ వ్యూహాత్మక మార్పులు చేయాలని సూచించాడు. బౌలింగ్ వ్యూహాలతో పాటు గేమ్ ప్లాన్‌పై కూడా అతనికి అపారమైన నాలెడ్జ్ ఉంది. ఆసీస్ పర్యటనలో మేం ఇంగ్లండ్ సిరీస్ ప్రణాళికలపై చర్చించాం. జో రూట్ బ్యాటింగ్ చేస్తుంటే ఫీల్డింగ్ సెటప్‌తో పాటు ఎలాంటి బంతులు వేయాలనేదానిపై వ్యూహాలు రచించాం. బ్రిస్బేన్ టెస్ట్‌లో అతను బెంచ్‌కే పరిమితమవ్వడంతో మేమిద్దరం చాలా మాట్లాడుకున్నాం'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

జీవితం ఏంటో తెలిసింది..

జీవితం ఏంటో తెలిసింది..

ఇక బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్‌లో తనకు నిరాశే ఎదురవ్వడంతో జీవితం, క్రికెట్ అంటే ఏంటో తెలిసిందని ఈ మణికట్టు స్పిన్నర్ తెలిపాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో తాను మరిన్నీ మ్యాచ్‌లు ఆడాల్సిందన్నాడు. ‘వ్యక్తిగతంగా ఐపీఎల్ 2020 సీజన్ నాకు కలిసిరాలేదు. నేను మరిన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది. నేను మంచి రిథమ్‌లో ఉన్నా.. అద్భుతంగా బౌలింగ్ చేసినా నాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదు. మరిన్ని మ్యాచ్‌లు ఆడుంటే సంతోషంగా ఫీలయ్యేవాడిని. నిజాయితీగా చెప్పాలంటే గత సీజన్‌ నా కెరీర్‌లో అత్యంత చెత్తది.

 అన్ని రోజు మనవి కావు..

అన్ని రోజు మనవి కావు..

2019 సీజన్ కూడా నాకు కలిసిరాలేదు. విఫలమైతే కానీ ఒత్తిని తట్టుకునే శక్తి రాదు. ప్రస్తుతం పరిస్థితులను నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. నా జీవితంలో వైఫల్యాలను చూశాను. కాబట్టి నేను ఇప్పుడు నేను రాణించకపోయినా బాధపడటానికి నాకు అది కొత్త కాదు. క్రికెట్‌లో అన్ని రోజులు మనవే ఉండవు. ప్రతీసారి అద్భుత ప్రదర్శన కనబర్చలేం. కానీ కష్టపడేతత్వాన్ని కొనసాగిస్తే అవకాశాలు అందుకొని విజయవంతం కావచ్చు.'అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. ఇక ఆసీస్ పర్యటనలో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్‌కు ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అవకాశాలు దక్కనున్నాయి.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, February 3, 2021, 15:41 [IST]
Other articles published on Feb 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X