న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

40 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవద్దు: తమ్ముడికి అన్న ఉచిత సలహా

By Nageshwara Rao
Krunals advice to brother Hardik: Dont get married till youre 40

హైదరాబాద్: 'ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దు.. 40 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకో' టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు తన అన్న కృనాల్ పాండ్యా ఇచ్చిన సలహా ఇది. భారత క్రికెట్ అభిమానులకు పాండ్యా బ్రదర్స్ సుపరిచితం. వీరి గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరూ ఎన్నో అద్భుత ప్రదర్శనలు కనబర్చారు. టీమిండియా ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా రాణిస్తుంటే, అన్న కృనాల్‌ పాండ్యా మాత్రం భారత జట్టులో చోటుదక్కకున్నా ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.

2017 ఐపీఎల్ సీజన్‌ ఫైనల్లో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచి ముంబై టైటిల్‌ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరూ ఆల్‌రౌండర్స్‌ అయినప్పటికి ఒకరు పేసర్‌ కాగా, మరొక స్పిన్నర్‌. తాజాగా ఐపీఎల్‌ 11వ సీజన్ ముగిసిన అనంతరం 'వాట్‌ద డక్‌ షో'లో పాల్గొన్న ఈ అన్నదమ్ములు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వెస్టిండిస్‌ క్రికెటర్లంటే అమితమైన ప్రేమ

వెస్టిండిస్‌ క్రికెటర్లంటే అమితమైన ప్రేమ

తమకు వెస్టిండిస్‌ క్రికెటర్లంటే అమితమైన ప్రేమ అని చిన్నప్పటి నుంచే వారిపై ఇష్టం కలిగిందని పాండ్యా బ్రదర్స్‌ చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌ సందర్భంగా ఓ సందర్భంలో ఈ సోదరులు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పోలార్డ్‌ పెద్దన్న అని సంబోధించిన సంగతి తెలిసిందే. అయితే చిన్నప్పుడు ఎక్కువగా వెస్టిండీస్‌ మ్యాచ్‌లు చూడటంతో వారిపై ఇష్టం కలిగిందని, వారిలో ఏదో ప్రత్యేకత ఉందని... చాలా యాక్టివ్‌గా ఉంటారని అన్నారు.

 హర్దిక్‌ చూడటానికి కరేబియన్‌లానే ఉంటాడు

హర్దిక్‌ చూడటానికి కరేబియన్‌లానే ఉంటాడు

హర్దిక్‌ చూడటానికి కరేబియన్‌లానే ఉంటాడని, దీంతో అతన్ని అందరు బ్లాక్‌ అని పిలిచేవారని నాటి రోజులను కృనాల్‌ గుర్తుచేసుకున్నారు. ‘హార్దిక్‌ నాకు చాలా కోపం, చిరాకు తెప్పిస్తాడు. చిన్నప్పుడు హార్దిక్‌ అచ్చు వెస్టిండీస్‌ వాసిలా ఉండేవాడు. ఎవరైనా అతన్ని నల్లగా ఉన్నావు అంటే చాలు. మా అమ్మ వారితో గొడవకు దిగేది. అమ్మా ఎందుకు గొడవకు వెళ్తున్నావు. హార్దిక్‌ నల్లగా ఉన్నాడు కాబట్టే అలా అంటున్నారు. అందులో తప్పేముందని వారించేవాడిని' అని కృనాల్‌ వివరించాడు.

 కెన్యా జట్టు సాధన కోసం బరోడాకు

కెన్యా జట్టు సాధన కోసం బరోడాకు

‘ఒకసారి ఏం జరిగిందంటే... 2003 ప్రపంచకప్‌ సందర్భంగాలో కెన్యా జట్టు సాధన కోసం బరోడా వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లంతా బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో మైదానంలో ఉన్న కొందరు చిన్నారులు కెన్యా ఆటగాళ్ల వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్‌లు అడిగారు. కానీ, ఎవరూ ఇవ్వలేదు. ఇంతలో కొందరు ఆటగాళ్లు హార్దిక్‌ను చూసి అతడికి మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు హార్దిక్‌ను చూసిన ఆటగాళ్లు కరేబియన్‌కు చెందినవాడని అనుకున్నారు. అప్పట్లో హార్దిక్‌ భారత్‌కు చెందిన వాడంటే ఎవరూ నమ్మేవారు కాదు' అని కృనాల్ అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.

40 ఏళ్ల వయస్సులో చేసుకో

40 ఏళ్ల వయస్సులో చేసుకో

కృనాల్‌ గతేడాది తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన తమ్ముడికి మాత్రం ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చాడు. ‘ఈ సందర్భంగా హార్దిక్‌కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నా. అదేంటంటే... నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోకు. 40 ఏళ్ల వయస్సులో చేసుకో. లేకుంటే నీ పని అంతే. అప్పటి వరకు చూస్తూ, వింటూ ఉండు' అని కృనాల్‌ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 30, 2018, 18:18 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X