న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్లాంక్ చెక్ ఇచ్చాడు: మాజీ క్రికెటర్‌కు పాండ్యా ఉదార సాయం

Krunal Pandya comes up with an incredible gesture for hospitalised ex-India cricketer Jacob Martin

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి వడోదరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ జాకబ్‌ మార్టిన్‌‌ను ఆదుకోవడానికి టీమిండియా అల్ రౌండర్ కృనాల్ పాండ్యా మందుకొచ్చాడు. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాకబ్ మార్టిన్‌ ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాకబ్ మార్టిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఆస్పత్రిలో మాజీ క్రికెటర్: బీసీసీఐకి భార్య లేఖ, స్పందించిన గంగూలీఆస్పత్రిలో మాజీ క్రికెటర్: బీసీసీఐకి భార్య లేఖ, స్పందించిన గంగూలీ

మార్టిన్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చిన పాండ్యా

మార్టిన్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చిన పాండ్యా

తాజాగా, కృనాల్ పాండ్యా జాకబ్ మార్టిన్‌కు ఓ బ్లాంక్ చెక్‌ను పాండ్యా ఇచ్చాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్ వెల్లడించారు. బ్లాంక్ చెక్ ఇచ్చిన పాండ్యా "సర్, మీకు ఎంత అవసరమో అంత మొత్తం రాసుకోండి. కానీ కనీసం రూ.లక్షకు తగ్గకూడదు" అని చెప్పడం విశేషం. ఇప్పటికే జాకబ్ మార్టిన్ చికిత్స కోసం బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ అసోసియేషన్ రూ.3 లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సౌరవ్‌ గంగూలీ సైతం

సౌరవ్‌ గంగూలీ సైతం

మార్టిన్‌ పరిస్థితి గురించి తెలుసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ సైతం అతడికి అవసరమైన సాయం చేస్తానని సోమవారం ప్రకటించాడు. "నేను, మార్టిన్‌ ఒకప్పుడు టీమ్‌ మేట్స్‌. తను చాలా కామ్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉండేవాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతడు తొందరగా కోలుకోవాలి. మీరు ఒంటరి వాళ్లు కారు. మేమంతా మీకు తోడున్నాం" అని గంగూలీ చెప్పిన సంగతి తెలిసిందే.

తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో జాకబ్‌ది కీలకపాత్ర

తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో జాకబ్‌ది కీలకపాత్ర

జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్‌లాంటి క్రికెటర్లంతా తమకు తోచినంత సాయం చేశారు. బరోడా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకబ్‌ మార్టిన్‌ మొత్తం పది వన్డేలాడి మార్టిన్‌ 158 పరుగులు చేశాడు.2000-01 సీజన్లో బరోడా తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో జాకబ్‌ది కీలకపాత్ర.

Story first published: Tuesday, January 22, 2019, 14:54 [IST]
Other articles published on Jan 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X