న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిష్ శ్రీకాంత్, అంజుమ్‌ చోప్రాలకు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

Krish Srikkanth, Anjum Chopra to receive CK Nayudu Lifetime Achievement Award


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్‌, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్‌ చోప్రాలకు అరుదైన గుర్తింపు లభించింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు.

ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12వ తేదీన ముంబైలో జరిగే వార్షిక అవార్డుల కార్యక్రమంలో వీరిద్దరిని బీసీసీఐ ఘనంగా సన్మానించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నైకు చెందిన కృష్ణమాచారి శ్రీకాంత్‌ 1981-92 మధ్య భార త జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేశాడు. 60 ఏళ్ల కృష్ణమాచారి శ్రీకాంత్‌ 1983లో భారత్ తొలిసారి ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు సభ్యుడు కూడా. ప్రపంచకప్ ఫైనల్లో విండిస్ భయంకర బౌలర్లు మాల్కమ్ మార్షల్, జోయల్ గార్నర్, అండీ రాబ ర్ట్స్, మైఖేల్ హోల్డింగ్‌ను ఎదుర్కొని టాప్‌స్కోరర్(38)గా నిలిచాడు.

1992లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009 నుంచి 2012 వరకు జాతీయ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే భారత్‌ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 1989లో శ్రీకాంత్ సారథ్యంలోనే సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

మరోవైపు భారత్‌కు 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టీ20లు ఆడిన అంజుమ్ బ్యాటింగ్‌లో మెరుగైన రికార్డులు నెలకొల్పింది.

Story first published: Saturday, December 28, 2019, 11:40 [IST]
Other articles published on Dec 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X