న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్‌: రెండో టీ20 ఓటమిపై విరాట్ కోహ్లీ

India vs Australia 2nd T20I : Kohli Lauded Maxwell For Massive Hundred In 2nd T20 | Oneindia Telugu
Kohli: We wanted to see players reaction to pressure

హైదరాబాద్: బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో రెండు టీ20ల సిరిస్‌ను 2-0తో చేజార్చుకుంది. ఫలితంగా కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్‌ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ మూడు ఫార్మాట్‌లలో కలిపి 16 సిరీస్‌లు ఆడింది. 14 సిరీస్‌లలో గెలిచింది.

<strong>రెండో టీ20లో భారత్ ఓటమి: సిక్సులతో సహా కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే</strong>రెండో టీ20లో భారత్ ఓటమి: సిక్సులతో సహా కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే

మరో సిరీస్‌ను 'డ్రా' చేసుకొని తాజా టి20 సిరీస్‌లో ఓడింది. ధోని నుంచి పగ్గాలందుకున్నాక సొంతగడ్డపై ఏ ఫార్మాట్లో అయినా కోహ్లీ సిరీస్‌ ఓడటం ఇదే తొలిసారి. 2014 నుంచి ఇప్పటిదాకా స్వదేశంలో అతను 7 టెస్టు, ఐదు వన్డే, రెండు టీ20 సిరీస్‌లు గెలిచాడు. ఒక సిరీస్‌ డ్రా అయింది. వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను ఓడిపోవడం భారత్‌కిదే తొలిసారి.

భారత్‌కు వరుసగా రెండో సిరిస్ ఓటమి

భారత్‌కు వరుసగా రెండో సిరిస్ ఓటమి

ఈ సిరీస్‌కంటే ముందు న్యూజిలాండ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది. మ్యాచ్ ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా అసాధారణంగా ఆడటంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌ను గెలవడానికి ఆసీస్‌కు పూర్తి అర్హత ఉంది. 190 పరుగులంటే చాలా మంచి స్కోరు. అది ఆసీస్‌ ముందు చిన్నబోయింది" అని అన్నాడు.

మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ గురించి చెప్పాలి

మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ గురించి చెప్పాలి

"ఇక్కడ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ గురించి చెప్పాలి. మ్యాచ్‌ను మా అందకుండా చేయడంలో మ్యాక్సీదే కీలక పాత్ర. మా బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడానికి ప్రయత్నించినా మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. మేము శాయశక్తులా గెలవడానికి యత్నించాం. అన్ని విభాగాల్లో ఆసీస్‌ పైచేయి సాధించడంతో ఓటమి తప్పలేదు" అని కోహ్లీ అన్నాడు.

ఆటగాళ్ల ప్రదర్శనపై అప్పుడే అంచనాకు రాలేం

ఆటగాళ్ల ప్రదర్శనపై అప్పుడే అంచనాకు రాలేం

కాగా, ఇది స్వల్ప సిరీస్‌ కావడంతో తమ ఆటగాళ్ల ప్రదర్శనపై అప్పుడే అంచనాకు రాలేమని కోహ్లీ చెప్పాడు. ఇక్కడ ప్రతీ ఒక్కరికీ సాధ్యమైనంత ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వడమే మా నిర్ణయమని కోహ్లీ అన్నాడు. ఈ తరహా మ్యాచ్‌లతో ఒత్తిడిలో ఎలా ఆడాలనేది తెలుస్తుందని చెప్పాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోహ్లీ తెలిపాడు.

Story first published: Thursday, February 28, 2019, 12:51 [IST]
Other articles published on Feb 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X