న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాకు అన్యాయం జరిగిందని కోహ్లీ సైట్ హ్యక్!!

కోహ్లీ సైట్ హ్యక్ !! అంతా బంగ్లా పనే..!
 Kohlis Website HACKED by Agitated Bangladeshi Fans Protesting Against Cheating in Asia Cup Final

న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో భారత జట్టు ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. జట్టును నడిపించింది రోహిత్ శర్మ అయినా ఆ విజయానికి బాధ్యుడు మాత్రం కోహ్లీయే అంటున్నారు బంగ్లాదేశ్ హ్యాకర్లు. ఈ మేర కోహ్లీ సొంత వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఐసీసీకి హెచ్చరికలు పంపారు.

 ఆసియా కప్ గెలవడం ఇది ఏడోసారి

ఆసియా కప్ గెలవడం ఇది ఏడోసారి

ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండానే టైటిల్ కైవసం చేసుకుంది. భారత్ ఆసియా కప్ గెలవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. తుది పోరులో బంగ్లాదేశ్ పోరాడినా.. చివరి బంతికి భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 117 బంతుల్లో 121 పరుగులు చేసిన అతణ్ని ధోనీ మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు.

అంపైర్ నిర్ణయానికి బంగ్లాదేశ్ అసంతృప్తి:

అంపైర్ నిర్ణయానికి బంగ్లాదేశ్ అసంతృప్తి:

థర్డ్ అంపైర్ చాలా సేపు రిప్లే చూసి దాస్ అవుటని ప్రకటించాడు. కానీ అంపైర్ నిర్ణయం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. అతడు ఔట్ కాకుండానే.. భారత్‌కు అనుకూలంగా అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించాడని మండిపడ్డారు.

లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేస్తూ:

లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేస్తూ:

లిటన్ దాస్‌ నాటౌట్ అయినా ఔటివ్వడం వల్లే కప్ చేజారిందని నమ్ముతున్న బంగ్లాదేశ్ అభిమానులు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అఫిషియల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. అందులో లిటన్ దాస్ అవుటైన ఫొటోలను పోస్ట్ చేశారు. దాన్ని ఎలా ఔటిస్తారో వివరణ ఇవ్వాలంటూ ఐసీసీ నిలదీస్తూ ఓ నోట్‌ను కూడా కోహ్లి వెబ్‌సైట్లో పోస్ట్ చేశారు. క్షమాపణలు చెప్పి, అంపైర్‌పై చర్యలు తీసుకోకపోతే వెబ్‌సైట్‌ను మళ్లీ హ్యాక్ చేస్తామని హెచ్చరించారు.

అవమానించడం కోసం కాదని.. నిరసన మాత్రమేనని

అవమానించడం కోసం కాదని.. నిరసన మాత్రమేనని

కోహ్లి వెబ్‌సైట్‌ను సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ గ్రూప్ హ్యాక్ చేసిందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. ఇది భారతీయులను అవమానించడం కోసం కాదని, తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన మాత్రమేనని హ్యాకర్లు తెలిపారు. క్రికెట్లో ప్రతి దేశాన్ని సమానంగా చూడాలని వారు కోరారు.

Story first published: Wednesday, October 3, 2018, 18:49 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X