న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. పైనెలు హద్దు మీరకుండానే ముగించారు: మైకెల్ హస్సీ

Kohli and Paine did not cross the line: Mike Hussey

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా మ్యాచ్ గెలిచి రెండో టెస్టులో అదే ఫలితాన్ని ఆశించిన టీమిండియా పెర్త్ వేదికగా బోల్తా కొట్టింది. తొలి ఇన్నింగ్స్ నుంచే ఆధిక్యం సంపాదించేందుకు తడబడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ సరిగా రసవత్తరంగా సాగుతున్న సమయంలో కోహ్లీ, టిమ్ పైనెకు మధ్య వాగ్వాదం జరిగింది. దానినే రెండో రోజుకు కొనసాగించాడు టిమ్. కోహ్లీని రెచ్చగొడుతూ.. పలు మార్లు ఉద్దేశ్యపూర్వకంగానే వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి వ్యవహారంపై బీసీసీఐ సైతం వివరణ ఇవ్వగా పలువురు మాజీలు దీనిపై చర్చకు దిగారు.

ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్ అయినప్పుడు సంబరాలను

ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్ అయినప్పుడు సంబరాలను

పెర్త్‌ టెస్టులో భారత్‌, ఆస్ట్రేలియా కెప్టెన్లు విరాట్‌ కోహ్లీ, టిమ్‌పైన్ మాటల యుద్ధం హద్దు మీరలేదని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీ అన్నాడు. పోటాపోటీగా జరిగే టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు సాధారణమేనని వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఔట్ అయినప్పుడు కోహ్లీ సంబరాలను హస్సీ ఇంతకు ముందు విమర్శించాడు. అయితే తాజాగా మరోసారి దాని గురించి మాట్లాడుతూ.. అతడు నియంత్రణ కోల్పోయాడని పేర్కొన్నాడు.

 ఇలాంటి ఘటనలు మామూలే

ఇలాంటి ఘటనలు మామూలే

‘ఇద్దరి గొడవ గీత దాటలేదు. అదే తరహాలో మరీ దూకుడు కనిపించలేదు. వ్యక్తిగతంగా కించపరిచే మాటలు లేవు. సిరీస్‌ కఠినంగా సాగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మామూలే. కోహ్లీ, పైన్‌ గొడవ చేతల వరకూ పోకుండా హుందాగానే నడుచుకున్నారు. భావోద్వేగాలు దెబ్బతినక ముందే గొడవ సద్దుమణిగింది. వారు విశ్వసించిన దానిపై నిలబడ్డారు. అదీ సరైన దారిలోనే జరిగింది. అంతేకానీ, అవమానాలు, అవహేళనలు లేవు' అని హస్సీ అన్నాడు.

 ఆసీస్‌ జట్టు ఆటతీరు ఆహ్లాదంగా

ఆసీస్‌ జట్టు ఆటతీరు ఆహ్లాదంగా

‘నా వరకు మైదానంలో ఆసీస్‌ జట్టు ఆటతీరు ఆహ్లాదంగా అనిపించింది. వారి నైపుణ్యాలు గొప్పగా ఉన్నాయి. గట్టి పోటీనిచ్చేందుకు శాయశక్తులా కష్టపడ్డారు. ఆటగాళ్లు దూకుడుగా ఉండాలి కానీ ప్రత్యర్థిని గౌరవించాలి. బహుశా చాలాసార్లు మేమలా నడుచుకోలేదు. మేం విమర్శలకు అర్హులమే. నా దృష్టిలో మాత్రం ప్రస్తుత జట్టు ఆస్ట్రేలియా బ్రాండ్‌ కఠిన క్రికెట్‌ను ఆడుతోంది.

 ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ని గౌరవించాలి

ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ని గౌరవించాలి

నువ్వు కోపంగా ఉండొచ్చు. దాంతోపాటుగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ని గౌరవించాల్సి ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ ఎఫ్పట్నుంచో అదే పద్ధతి పాటిస్తుంది. కానీ, అన్ని సార్లు మేము అలాగే ఊరుకోం. ఆస్ట్రేలియా క్రికెట్ గట్టి పోటీనివ్వడంతో గేమ్ మంచి రసవత్తరంగా సాగింది. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు విమర్శలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఆస్ట్రేలియా తన స్థాయి ప్రదర్శన చేసిందని అనుకుంటున్నాను' అని హస్సీ అన్నాడు.

Story first published: Friday, December 21, 2018, 17:53 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X