న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kohli on CAA: సున్నితమైన అంశం, బాధ్యత లేకుండా మాట్లాడలేను

Kohli on CAA: Dont want to comment irresponsibly without full knowledge

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. సీఏఏ అనేది చాలా సున్నితమైన అంశమని దానిపై పూర్తి అవగాహన వచ్చాకే మాట్లాడగలనని చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకొచ్చిన మొదట్లో అస్సాం రాజధాని గువహటి వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం గువహటి వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా తలపడనుంది.

స్నో మ్యాన్‌ను ఇలా రూపొందించాలి: ధోనికి సాయం చేసిన జీవా (వీడియో)స్నో మ్యాన్‌ను ఇలా రూపొందించాలి: ధోనికి సాయం చేసిన జీవా (వీడియో)

ప్రధాని నరేంద్ర మోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని విరాట్ కోహ్లీ స్వాగతించాడు. "భారత రాజకీయ చరిత్రలో ఓ అద్భుతమైన చర్య"గా నోట్ల రద్దుని అభివర్ణించాడు. ఆ సమయంలో నోట్ల రద్దు గురించి ఏం తెలుసుని పలువురు కోహ్లీపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్పందించమని అడగ్గా విరాట్ కోహ్లీ ఆచి తూచి మాట్లాడాడు. "ఈ వ్యవహారంపై నేను బాధ్యత లేకుండా మాట్లాడలేను. ఇరువైపులా తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి, పూర్తి అవగాహన తెచ్చుకున్నాకే దీనిపై మాట్లాడటం మంచిది" అని అన్నాడు.

నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన మంచిది కాదు: విరాట్ కోహ్లీనాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన మంచిది కాదు: విరాట్ కోహ్లీ

"ప్రస్తుతానికి గువహటి సురక్షితంగా ఉంది. రహదారులపై మాకెలాంటి ఇబ్బందులు కనిపించలేదు" అని విరాట్‌ అన్నాడు. కాగా, తొలి టీ20కి అసోం క్రికెట్ అసోసియేషన్ పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌కి ఎలాంటి బ్యానర్లు, జేబు రుమాళ్లు, తువ్వాళ్లను అనుమతించడం లేదు. అస్సామీలు తువ్వాళ్ల ద్వారా నిరసన తెలిపే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

Story first published: Saturday, January 4, 2020, 17:59 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X