న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండర్సన్ కొట్టిన బంతి తనకే దెబ్బ తగిలేలా చేసింది..! (వీడియో)

'Knocked A Tooth Out?': James Anderson's Golf Outing With Stuart Broad
 Knocked A Tooth Out?: James Andersons Golf Outing With Stuart Broad Ends In Disaster.

ఇంగ్లాండ్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాను కట్టడిచేయాలంటే కోహ్లీని అవుట్ చేయాలి. కోహ్లీని ఎదుర్కోవాలంటే అండర్సన్ బౌలింగ్ చేయాలి ఇది ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల తలంపు. కానీ, ఈ అండర్సన్ కొట్టిన బంతి తనకే దెబ్బ తగిలేలా చేసింది. ఇండియా జట్టుపై తొలి టెస్టు విజయాన్ని దక్కించుకున్న టీమ్ ఇంగ్లాండ్ ప్రాక్టీస్‌తో పాటు విరామాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ తన సహచరుడు స్టువర్టు బ్రాడ్ ఇద్దరూ కలిసి అవుటింగ్ కోసం సరదాగా బయటికి వెళ్లారు.

మామూలుగానే గోల్ప్ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడే అండర్సన్ గోల్ప్ ఆడేందుకు సిద్ధపడిపోయాడు. కానీ, అది గోల్ప్ కోర్ట్ కాదు. అయినా సరే ఏదో చిన్నపాటి ఏర్పాట్లు చేసుకుని ఒక్కసారిగా బంతిని కొట్టాడు. అంతే బంతి ముందుకువెళ్లి ఎదురుగా అడ్గు ఉన్నదానికి తగిలి దిశను మార్చుకుంది. ఆ ముందు ఉన్న వస్తువు (రాయి లాంటిది) ఎగిరి అండర్సన్ మొహానికి తగిలింది. ఈ ఘటనతో పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు. అయితే ఆ వీడియోను అండర్సన్ సహచరుడైన స్టువర్ట్ బ్రాడ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసి స్మైలీలతో బాగా అయిందన్నట్లు పెట్టాడు.

గురువారం నుంచి జరగనున్న భారత్-ఇంగ్లాండ్‌ల రెండో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం క్లబ్ బయట జరిగిన వివాదం విషయంలో కోర్డు విచారణకు బెన్ స్టోక్స్ హాజరుకావల్సి ఉండగా అతని స్థానంలో క్రిస్ వోక్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంచితే టీమిండియాలోనూ కొద్దిపాటి మార్పులు సూచిస్తున్నారు దిగ్గజాలు. కేఎల్ రాహుల్‌కు బదులుగా పూజారాను జట్టులోకి తీసుకోవాలంటూ కోహ్లీకి సూచనలిస్తున్నారు. మూడో స్థానంలో డిఫెన్సింగ్ ప్లేయర్ పూజారా దిగితే జట్టుకు మంచి తోడ్పాటు లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కానీ, పూజారా ఇటీవల కౌంటీ క్రికెట్లో ఆడి పెద్దగా రాణించలేకపోయాడు.

Story first published: Monday, August 6, 2018, 13:54 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X