న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్ మ్యాచ్.. రెండు వైపులు అతనే అంపైర్

KN Ananthapadmanabhan umpire from both ends in Ranji Trophy final

రాజ్‌కోట్‌: బెంగాల్‌-సౌరాష్ట్ర జట్ల మధ్య రంజీ ఫైనల్‌ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్‌లో రెండో రోజు (మంగళవారం) వింత ఘటన చోటుచేసుకుంది. అంపైర్ కేఎన్ అనంత పద్మనాభన్ రెండు వైపుల నుండి అంపైరింగ్ విధులు నిర్వర్తించారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ సి షంసుద్దీన్ గాయపడడంతో పద్మనాభన్ రెండు వైపుల నుండి అంపైరింగ్ బాధ్యతలను కొనసాగించాడు. విషయంలోకి వెళితే...

IND vs SA: సచిన్ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన కోహ్లీ.. మరో 133 పరుగులు చేస్తే..?IND vs SA: సచిన్ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన కోహ్లీ.. మరో 133 పరుగులు చేస్తే..?

అంపైర్ షంసుద్దీన్‌కు గాయం

అంపైర్ షంసుద్దీన్‌కు గాయం

తొలిరోజు సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌ ఆడుతుండగా.. బెంగాల్‌ ఫీల్డర్ విసిరిన బంతి అంపైర్ సి షంసుద్దీన్‌కు బలంగా తాకింది. దీంతో రెండో రోజు విధులు నిర్వర్తించడానికి షంసుద్దీన్‌ మైదానంలోకి రాలేదు. పియూష్ కక్కర్‌ను స్క్వేర్ లెగ్ అంపైర్‌గా నియమించారు. అయితే పియూష్ లోకల్ అంపైర్‌ కావడంతో.. అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అతనికి లేదు. పియూష్ తన నిర్ణయాన్ని అనంత పద్మనాభన్‌కు చెప్పాల్సి ఉంటుంది. అప్పడు పద్మనాభన్‌ అధికారికంగా ప్రకటిస్తాడు. దీంతో పద్మనాభన్‌ రెండు వైపులా అంపైరింగ్ బాధ్యతలను నిర్వర్తించాడన్నమాట.

రవి ఉన్నాడు కానీ

రవి ఉన్నాడు కానీ

ప్రస్తుతం రంజీ ఫైనల్‌ అంపైర్ల లిస్టులో అనుభవజ్ఞుడైన ఎస్ రవి ఉన్నాడు. రవి డిఆర్ఎస్ విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి.. అతడు ఆన్-ఫీల్డ్ అంపైరింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. దీంతో ఇక చేసేదేంలేక లోకల్ అంపైర్‌ పియూష్ కక్కర్‌ను తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇకపై పాల్గొనని శంసుద్దీన్ స్థానంలో యశ్వంత్ బార్డేని నియమిస్తారని 'ది హిందూ' పేర్కొంది. ఏదేమైనా పద్మనాభన్ ఇప్పడూ వార్తల్లో నిలిచాడు.

పుజారా హాఫ్ సెంచరీ

పుజారా హాఫ్ సెంచరీ

వరుసగా రెండోసారి రంజీ ఫైనల్‌ ఆడుతున్న సౌరాష్ట్ర భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. తొలి రోజు బ్యాటింగ్‌లో తడబడిన సౌరాష్ట్ర రెండో రోజు పుంజుకుంది. బ్యాట్స్‌మన్‌ అర్పిత్‌ వసవాడ (106) సెంచరీతో అదరగొట్టగా..టెస్టు స్పెషలిస్ట్‌ ఛతేశ్వర పుజారా (51) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఈ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపిస్తోంది. టీ విరామ సమయానికి సౌరాష్ట్ర 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. తొలి రోజు బ్యాటింగ్‌ కొనసాగించలేక మధ్యలోనే వెనుదిరిగిన పుజారా.. రెండో జట్టును ఆదుకున్నాడు.

పిచ్‌ సరిగ్గా లేదు

పిచ్‌ సరిగ్గా లేదు

రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో పిచ్‌ మరీ దారుణంగా ఉందని బెంగాల్‌ టీమ్‌ కోచ్‌ అరుణ్‌ లాల్‌ అభిప్రాయపడ్డాడు. పిచ్‌ మరీ దారుణంగా ఉంది. బీసీసీఐ ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. బంతి అస్సలు పైకి రావట్లేదు. దుమ్ము లేవడంతో పాటు బంతి కింద నుంచి వెళ్తోంది' అని అరుణ్‌ పేర్కొన్నాడు.మీడియం పేసర్‌ బంతులేస్తున్నా బంతి స్లిప్‌ వరకు కూడా వెళ్లట్లేదన్నాడు.

Story first published: Tuesday, March 10, 2020, 17:38 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X