న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌‌గా అనంతపద్మనాభన్.. నాలుగో భారతీయుడిగా గుర్తింపు!!

KN Ananthapadmanabhan included in ICC’s panel

దుబాయ్: కేరళ మాజీ లెగ్ స్పిన్నర్, భారత అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్‌కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇంటర్నేషనల్ ఫ్యానల్ ఆఫ్ అంపైర్స్‌ జాబితాలో అనంతపద్మనాభన్‌కి చోటు దక్కింది. దీంతో అంతర్జాతీయ ప్యానెల్‌లో అనంతపద్మనాభన్ నాలుగవ భారత అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యానల్‌లో భారత్‌కి చెందిన సి షంషుద్దీన్, అనిల్ చౌదరి, వీరేంద్ర శర్మలు ఉన్నారు.

ఇటీవల ఇంటర్నేషనల్ ఫ్యానల్ అంపైర్‌గా ఉన్న నితిన్ మీనన్.. ఐసీసీ ఎలైట్ ఫ్యానల్‌‌‌కి వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని అనంతపద్మనాభన్‌‌తో ఐసీసీ భర్తీ చేసినట్లు ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా ఎస్‌ రవి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా భారత్‌కి చెందిన ఐదుగురు అంపైర్లు ఐసీసీ అంపైర్స్‌గా సముచిత స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది వరకు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్క అంఫైర్ కూడా లేని సంగతి తెలిసిందే.

కేరళ తరఫున లెగ్‌ స్పిన్నర్‌గా 1988 నుంచి 2004 వరకూ కేఎన్ అనంతపద్మనాభన్‌ మ్యాచ్‌లు ఆడారు. 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన అనంతపద్మనాభన్‌.. రంజీల్లో కేరళ తరఫున 2000 పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన తొలి క్రికెటర్‌గా అప్పుడు అరుదైన ఘనత సాధించారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్, రంజీ ట్రోఫీ, లిస్ట్-ఎ, లయన్స్, టీ20 మ్యాచ్‌ల్లో రెగ్యులర్‌ అంపైర్‌గా విధులు నిర్వహిస్తారు. ఇక యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ జరగనున్న ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

గత మార్చిలో బెంగాల్‌-సౌరాష్ట్ర జట్ల మధ్య రంజీ ఫైనల్‌ రెండో రోజులో వింత ఘటన చోటుచేసుకుంది. అంపైర్ కేఎన్ అనంత పద్మనాభన్ రెండు వైపుల నుండి అంపైరింగ్ విధులు నిర్వర్తించారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ సి షంసుద్దీన్ గాయపడడంతో.. పద్మనాభన్ రెండు వైపుల నుండి అంపైరింగ్ బాధ్యతలను కొనసాగించారు. తొలిరోజు సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌ ఆడుతుండగా.. బెంగాల్‌ ఫీల్డర్ విసిరిన బంతి అంపైర్ సి షంసుద్దీన్‌కు బలంగా తాకింది.

దీంతో రెండో రోజు విధులు నిర్వర్తించడానికి షంసుద్దీన్‌ మైదానంలోకి రాలేదు. పియూష్ కక్కర్‌ను స్క్వేర్ లెగ్ అంపైర్‌గా నియమించారు. అయితే పియూష్ లోకల్ అంపైర్‌ కావడంతో.. అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అతనికి లేదు. పియూష్ తన నిర్ణయాన్ని అనంత పద్మనాభన్‌కు చెప్పాల్సి ఉంటుంది. అప్పడు పద్మనాభన్‌ అధికారికంగా ప్రకటిస్తారు.

లేడీ కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా గొడవ.. ఒత్తిడి తట్టుకోలేక ఆసుపత్రిలో!!లేడీ కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా గొడవ.. ఒత్తిడి తట్టుకోలేక ఆసుపత్రిలో!!

Story first published: Tuesday, August 11, 2020, 16:14 [IST]
Other articles published on Aug 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X