న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: అంతకన్నా ఏం చేయలేం కదా.. చెత్త ఫామ్‌పై నోరు విప్పిన రాహుల్

KL Rahul talks about his poor form in INDvsBAN series

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. కానీ ఈ సిరీస్‌లో టీమిండియా టాపార్డర్ వైఫల్యాలు జట్టుకు భారంగా మారాయి. ముఖ్యంగా జట్టు తాత్కాలిక సారధి కేఎల్ రాహుల్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ కూడా అదే మాదిరి ఫెయిలయ్యాడు. ఇటీవలి కాలంలో మళ్లీ గాడిలో పడినట్లు కనిపించిన కోహ్లీ.. ఈ టెస్టు సిరీస్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేదు.

వంద శాతం ఇవ్వడానికి ట్రై చేశా..

వంద శాతం ఇవ్వడానికి ట్రై చేశా..

ఇదే విషయంపై కేఎల్ రాహుల్ తాజాగా స్పందించాడు. బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల్లో అతను వరుసగా 22, 23, 10, 2 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కసారి కూడా కనీసం 25 పరుగుల స్కోరు దాటలేకపోయాడు. దీని గురించి మాట్లాడిన రాహుల్.. 'ఇంతకు ముందు ఏం చేసి ఉంటే బాగుండేది? అని ఆలోచిస్తూ బరిలో దిగం. అలాగే ఆ తర్వాత ఏం జరుగుతుందని కూడా టెన్షన్ పడటం జరగదు. ఆ క్షణంలో మైదానంలో నూటికి నూరు శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు అది అనుకున్నట్లు జరగదు అంతే' అని వివరించాడు.

భవిష్యత్తుకు ఇవి పాఠాలు..

భవిష్యత్తుకు ఇవి పాఠాలు..

తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని రాహుల్ చెప్పాడు. అయితే ఏదీ కూడా ఎక్కువ కాలం కొనసాగదని తనకు తెలుసన్నాడు. 'మూడు ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు ఒక దాని నుంచి మరొక ఫార్మాట్‌కు చటుక్కున మారడం కష్టం. వ్యక్తిగతంగా నేను చాలా రోజులుగా టెస్టు క్రికెట్ ఆడలేదు. కాబట్టి మళ్లీ ఆ మైండ్ సెట్‌లోకి వెళ్లడానికి కొంత టైం పడుతుంది' అని చెప్పాడు. అలాగే బంగ్లాదేశ్ పర్యటనలో తన ప్రదర్శన ఏమాత్రం బాగలేదని ఒప్పుకున్నాడు. అయితే దీని నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు.

ప్రయత్నం చేసినా ఫలితం లేదు..

ప్రయత్నం చేసినా ఫలితం లేదు..

'బంగ్లా పర్యటనలో కొన్ని ప్రదర్శనలు బాగలేవు. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను నా ప్రయత్నం చేశాను కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఇక ముందు నేను ఏం చేయగలనో? నాలో ఏ విషయాన్ని మెరుగు పరుచుకోగలనో ఆలోచిస్తాను. ప్రిపేర్ అవడం, మరింత కష్టపడటం మాత్రమే కదా మన చేతుల్లో ఉండేది. కానీ ఏం చేసినా మనం పూర్తిగా పర్‌ఫెక్ట్ అవ్వలేం. వచ్చే నెల రోజులు మొత్తం స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేసినా ఆ తర్వాతి మ్యాచుల్లో సెంచరీలు చేస్తామని గ్యారంటీ ఉండదు కదా. సరైన మైండ్ సెట్‌తో ప్రిపేర్ అవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఆస్ట్రేలియా నాలుగు కీలకమైన టెస్టులు ఆడనున్నాం. అప్పుడు పిచ్‌లు స్పిన్‌కు సహకరిస్తాయి. ఆస్ట్రేలియా కూడా దానికి గట్టిగా ప్రిపేర్ అయి వస్తుంది' అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, December 27, 2022, 20:43 [IST]
Other articles published on Dec 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X