న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌: కేఎల్‌ రాహుల్‌కు నం.4 స్థానం దక్కేనా?

KL Rahul slowly securing India’s No 4 spot?: Twitter in awe after his magical 100 against MI

బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ( 100 నాటౌట్‌; 64 బంతుల్లో 6×4, 6×6) సెంచరీ సాధించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించనుంది. ఈ సమయంలో రాహుల్ సెంచరీ చేయడం హాట్ టాపిక్ అయింది.

రాహుల్‌కు వారే పోటీ:

రాహుల్‌కు వారే పోటీ:

టీమిండియా జట్టులో నం.4 స్థానంపై ఇప్పటికీ ఉత్కంటే. ప్రపంచకప్‌లో ఈ స్థానంలో ఎవరికీ ఎంపికచేస్తారా అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. సెలెక్టర్లతో సహా కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే ఈ స్థానంలో పలువురిని ప్రయత్నించినా.. సరైన బ్యాట్స్‌మన్‌ మాత్రం దొరకలేదు. అయితే ప్రస్తుతం నం.4 స్థానంకు అంబడి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, అంజిక్య రహానేల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

నం.4 స్థానంకు రాహులే కరెక్ట్:

నం.4 స్థానంకు రాహులే కరెక్ట్:

ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను చూసి నం.4 స్థానంను ఖరారు చేస్తారని సమాచారం తెలుస్తోంది. ఈ సమయంలో రాహుల్‌.. ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ చేసి అభిమానులతో సహా సెలెక్టర్లను ఆకర్షించాడు. రాహుల్‌ సెంచరీ ప్రదర్శనపై అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు. టీమిండియాలో నం.4 స్థానంకు రాహులే కరెక్ట్ అని పలువురు అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరికొందరేమో నం.4 స్థానం రాహుల్‌కే అని ఫిక్స్ అయిపోయారు.

నం.4 స్థానం దక్కేనా?:

ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ 4, 1, 71 (నాట్ అవుట్), 15, 55, 71 (నాట్ అవుట్), 100 (నాట్ అవుట్) పరుగులు చేసాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. మొత్తం 7 మ్యాచ్‌లలో 317 పరుగులు చేసాడు. ఈ గణాంకాలు చూస్తే ఈ సీజన్‌లో రాహుల్‌ బాగానే ఆడాడు. మరోవైపు రాహుల్‌కు పోటీగా ఉన్న రాయుడు, రహానేలు అంతగా ప్రభావం చూపడం లేదు. దీంతో నం.4 స్థానం రాహుల్‌కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్‌కు రిజర్వు ఓపెనర్ గా కూడా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోమనే వార్తలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో సోమవారం కానీ ఓ క్లారిటీ రానుంది.

Story first published: Thursday, April 11, 2019, 16:25 [IST]
Other articles published on Apr 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X