న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాఫీ కప్పుతో కేఎల్ రాహుల్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!!

KL Rahul Shares Picture Drinking Coffee, Fans Come Up With Hilarious Memes

బెంగళూరు: ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి మూడు నెలలకు పైగా క్రీడాలోకం స్తంభించిపోయింది. ఇటీవలే లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో అక్కడక్కడ ఆటలు పునః ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే విండీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటన కోసం వెళ్లి అక్కడ సాధన చేస్తోంది. పాకిస్తాన్ టీమ్ కూడా ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో.. బీసీసీఐ ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు కూడా అనుమతివ్వలేదు. దీంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.

నెట్టింట్లో వైరల్

నెట్టింట్లో వైరల్

ఐపీఎల్ 2020, క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవడంతో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్ ఇంటికే పరిమతమయ్యాడు. ఆటకు దూరంగా ఉన్నా.. రాహుల్ సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉన్నాడు. పలు లైవ్, చాట్ షోలలో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నాడు. మరోవైపు తనకు సంబందించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.

కాఫీ తాగుతూ రిలాక్స్

కాఫీ తాగుతూ రిలాక్స్

కేఎల్ రాహుల్ తాజాగా కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. ఇది చూసిన నెటిజన్లు.. గత ఏడాది 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో నోరుజారిన విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు. 'నీ వ్యవహారం ఇంకా పూర్తి కాలేదా?' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'బహుశా మీరు బుల్లెట్ లేని తుపాకీని కోల్పోయారు' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. రాహుల్ మళ్లీ దొరికిపోయాడు, మీమ్స్ వర్షం కురిపించండి అంటూ అతనిపై సెటైర్లు వేస్తున్నారు. రాహుల్, పాండ్యాకి ఆ టాక్ షో వ్యాఖ్యలు పంటి కింద రాయిలా అప్పుడప్పుడు తగులుతూనే ఉన్నాయి.

అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు:

అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు:

2019 జనవరిలో 'కాఫీ విత్ కరణ్' టాక్ షోక్‌కి హాజరైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తన జేబులో కండోమ్ ప్యాకెట్లు ఉంచుకునేవాడినని అసభ్యకరంగా మాట్లాడాడు. తన తండ్రికి ఓసారి దొరికిపోగా.. ఫర్వాలేదు సేప్టీ వాడుతున్నావని కితాబిచ్చినట్లు షోలో వెల్లడించాడు. యువతకి స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా నోరుజారడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రాగా .. రాహుల్, హార్దిక్‌పై బీసీసీఐ కొన్ని రోజులు నిషేధం విధించింది. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పడంతో వారిపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.

కరోనా ఎఫెక్ట్.. న్యాయవాదిగా మారనున్న స్టార్ షూటర్‌!!

Story first published: Tuesday, June 30, 2020, 14:22 [IST]
Other articles published on Jun 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X