న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేఎల్ రాహుల్..

KL Rahul scored a half century in the ongoing match against Zimbabwe

సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ గత మ్యాచ్ ల్లో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులే చేశాడు.

రోహిత్ శర్మ
ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ముజారబానీ బౌలింగ్ లో షాట్ కు యత్నంచి మసకద్జాకు చిక్కాడు. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నిరాశ పరిచాడు రోహిత్ శర్మ. 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 బంతుల్లో 4 పరుగులకే చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులే చేశాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దినేక్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా గ్రూప్-2 నుంచి భారత్ , పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లగా.. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్ కు వెళ్లాయి.

Story first published: Sunday, November 6, 2022, 14:52 [IST]
Other articles published on Nov 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X