న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ ఫామ్‌లోకి కేఎల్ రాహుల్: కేరళపై సెంచరీ, లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆరోది

KL Rahul Roars Back To Form With Stunning Century In Vijay Hazare Trophy

హైదరాబాద్: విండిస్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో భారత జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా యువ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో కర్ణాటక జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ శనివారం చిన్నస్వామి స్టేడియంలో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగాడు.

మొత్తం 122 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ సాధించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేఎమ్ ఆఫిస్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే సైతం అద్భుత ప్రదర్శనతో అలరించాడు.

స్వీట్లు, నెయ్యి తిననివ్వడం లేదు: తన డైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వినేశ్ ఫోగాట్స్వీట్లు, నెయ్యి తిననివ్వడం లేదు: తన డైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వినేశ్ ఫోగాట్

కేరళ విజయ లక్ష్యం 295

కేరళ విజయ లక్ష్యం 295

మనీష్ పాండే 51 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో కర్ణాటక 49.5 ఓవర్లలో 294 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో కేరళకు 295 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ వారం మొదట్లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 123 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన

విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన

విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన కారణంగా కేఎల్ రాహుల్ భారత జట్టుకు దూరమయ్యాడు. విండిస్ పర్యటనలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 44, 38, 13, 6లతో పేలవ ప్రదర్శన చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు కోల్పోయాడు.

కేఎల్ రాహుల్ స్థానంలో గిల్‌

కేఎల్ రాహుల్ స్థానంలో గిల్‌

కేఎల్ రాహుల్ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. టెస్టు సిరిస్‌కు ముందు జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో సైతం కేఎల్ రాహుల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ధర్మశాల వేదకగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది.

కేఎల్ రాహుల్ స్టీమ్ బాత్

రెండు రోజుల క్రితం కేఎల్ రాహుల్ స్టీమ్ బాత్ చేస్తోన్న ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ "చిల్లింగ్" అనే కామెంట్ పోస్టు చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'ముందు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోమని చెప్పండి' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Story first published: Saturday, September 28, 2019, 13:42 [IST]
Other articles published on Sep 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X