న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే మనీశ్ పాండేను పక్కనపెట్టాం: కేఎల్ రాహుల్

KL Rahul Reveals Why is Manish Pandey Not Playing Today’s Match Against PBKS

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా పంజాబ్ బరిలోకి దిగుతుండగా లక్నో సూపర్ జెయింట్స్‌లో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి రాగా.. పేలవ బ్యాటింగ్‌తో విఫలమవుతున్న మనీశ్ పాండే ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఎక్స్‌ట్రా బౌలర్ ఆప్షన్ కోసమే మనీశ్ పాండేపై వేటు వేసామని కేఎల్ రాహుల్ తెలిపాడు. ఇది బౌండరీ స్కోరింగ్ మైదానమని, అదనపు బౌలర్ ఉంటే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

'మనీశ్ పాండే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ధారళంగా పరుగులు వచ్చే మైదానం కావడంతోనే అదనపు బౌలర్ తీసుకోవాలనుకున్నాం. జాసన్ హోల్డర్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే అతను బ్యాటింగ్ చేసే పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నా. వస్తే మాత్రం అతను తన సత్తా ఏంటో చూపిస్తాడు. ఈ మైదానంలో డ్యూ వచ్చే అవకాశం లేదు. గత మ్యాచ్‌ల్లానే సాధారణ మ్యాచ్. బౌలర్లకు అనుకూలించే ఆరంభ ఓవర్లలో రాణించడం చాలా ముఖ్యం. ఇంతకుముందు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. స్మార్ట్‌గా బ్యాటింగ్ చేయాలి.

ఈ మ్యాచ్‌ను సాధారణ గేమ్‌లానే భావిస్తున్నాం. విజయం సాధించి మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాం. ఈ టోర్నీని మేం ఆస్వాదిస్తున్నాం. ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆస్వాదిస్తూ ఆడుతున్నాం. మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఒక్క మ్యాచ్‌లో మయాంక్ కలిసిరావద్దని కోరుకుంటున్నా'అని రాహుల్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిచిన మయాంక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్ష్యాలను చేధించడం తమకు బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పిన మయాంక్.. డ్యూ ప్రభావం ఉండదు కాబట్టి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేయాలన్నాడు. అప్పుడు చేజింగ్ సులువవుతుందని చెప్పాడు. రాహుల్‌కు ప్రత్యర్థి ఆడటం సవాల్‌తో కూడుకున్నదేనని మయాంక్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, మోహ్‌సిన్ ఖాన్

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష‌దీప్ సింగ్

Story first published: Friday, April 29, 2022, 20:00 [IST]
Other articles published on Apr 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X