న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇలా చేయడం.. రొనాల్డోను చూసి నేర్చుకున్నా.: కేఎల్ రాహుల్

 KL Rahul Reveals Cristiano Ronaldo Inspiration Behind Celebration With Virat Kohli

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ఆరంభించింది టీమిండియా. భారీ అంచనాలతో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. అనుకున్న స్థాయిలో రాణించి విజయకేతనం ఎగరేసింది. దీంతో ఇంగ్లీషు గడ్డపై భారత బ్యాట్స్‌మెన్ రాణించలేరన్న అపోహను తుడిచిపెట్టేసింది. రెండు నెలల పాటు జరగనున్న ఈ పర్యటనకు మంగళవారం తెచ్చిపెట్టిన విజయం మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ క్రమంలో.. టీమిండియా మొత్తంగా కష్టపడి విజయాన్ని నమోదు చేసినా.. ప్రత్యేకంగా బౌలర్ కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ అందరి దృష్టినీ తమ వైపే తిప్పేసుకున్నారు.

54 బంతుల్లో సెంచరీని దాటేసి 101 పరుగులు

54 బంతుల్లో సెంచరీని దాటేసి 101 పరుగులు

అద్భుతంగా రాణించిన రాహుల్.. 54 బంతుల్లో సెంచరీని దాటేసి 101 పరుగులు పూర్తిచేశాడు. ఇక కుల్దీప్ యాదవ్ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ 5వికెట్లు పడగొట్టాడు. అయితే సెంచరీ తర్వాత రాహుల్ సెలబ్రేట్ చేసుకున్న తీరు చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

 అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లితోనూ అలాగే:

అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లితోనూ అలాగే:

తాను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు.. తర్వాత అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లితోనూ అలాగే చేశాడు. అయితే ఈ స్టెల్‌లో సంబరాలు చేసుకోవడం తాను పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను చూసే నేర్చుకున్నట్లు రాహుల్ చెప్పాడు.

మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్‌తో మాట్లాడుతూ

మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్‌తో మాట్లాడుతూ రాహుల్ ఈ విషయాన్ని చెప్పాడు. తానెప్పుడూ హార్దిక్ పాండ్యాకు హ్యాండ్ షేక్ ఇలాగే ఇస్తానని, ఇంగ్లండ్ టూర్ ముగిసేలోపు టీమ్‌లో ఉన్న అందరితోనూ ఇలాగే చేస్తానని రాహుల్ అన్నాడు. రొనాల్డోకు కోహ్లి పెద్ద అభిమాని అని కూడా ఈ సందర్భంగా రాహుల్ చెప్పాడు.

విన్నింగ్ షాట్ సిక్స్ బౌండరీ బాది మ్యాచ్‌కు ముగింపు

విన్నింగ్ షాట్ సిక్స్ బౌండరీ బాది మ్యాచ్‌కు ముగింపు

చేధనకు దిగిన టీమిండియా బ్యాట్స్‌మన్ ధావన్ కేవలం 4బంతులు ఆడి 4పరుగులకే చేతులెత్తేయగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ పంజా విదిల్చాడు. అతనికి మద్దతుగా నిలిచేందుకు మరో ఎండ్‌లో రోహిత్ మంచి ప్రయత్నమే చేసినా చివరి వరకూ నిలబడలేకపోయాడు. రోహిత్ అవుట్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. రాహుల్‌కు సహకారం అందించడంతో పాటు.. విన్నింగ్ షాట్ సిక్స్ బౌండరీ బాది మ్యాచ్‌కు చక్కటి ముగింపును అందించాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:51 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X