న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: టీమిండియా కీపర్‌గా రాహులే బెస్ట్ ఆప్షన్.. సంజూకు ఛాన్స్ లేనట్లే..?

KL Rahul is the best option for Team India Wicket Keeper

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా తీసుకున్న షాకింగ్ నిర్ణయం.. చాలా రోజుల తర్వాత మళ్లీ కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించడం. వన్డేల్లో పంత్ రాకముందు రాహుల్ ఈ బాధ్యతలు నిర్వర్తించినా.. పంత్ వచ్చిన తర్వాత కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గానే కొనసాగుతున్నాడు. ఇప్పుడు పంత్ లేకపోవడంతో ఇషాన్ కిషన్ వంటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా మళ్లీ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు ఇవ్వడం అందరికీ షాకిచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కీపర్‌గా రాహుల్‌ను నియమించడమే కరెక్ట్ నిర్ణయంగా కనిపిస్తోంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే?

టాపార్డర్‌లో ఖాళీ..

టాపార్డర్‌లో ఖాళీ..

టీమిండియా టాపార్డర్‌లో స్పెషలిస్టు వికెట్ కీపర్‌కు చోటు లేదు. ఓపెనర్లుగా రోహిత్, ధవన్ స్థానాలు సుస్థిరమయ్యాయి. అలాగే వన్డేల్లో ఇంకా ఫామ్ అందుకోకపోయినా.. మూడో స్థానంలో కోహ్లీ ఫిక్స్. ఇక ఇంత కాలం పంత్ రాణించిన నాలుగో స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ ఆక్రమించేశాడు. దీంతో టాపార్డర్‌లో వికెట్ కీపర్‌కు చోటు లేకుండా పోయింది. పంత్‌ను తీసుకున్నా ఆరో స్థానంలో పంపాల్సి ఉంటుంది. ఈ స్థానంలో పంత్ రాణించడం కష్టంగా కనబడుతోంది.

మిగతా కీపర్లు ఫెయిల్..

మిగతా కీపర్లు ఫెయిల్..

రాహుల్ కాకుండా మిగతా కీపర్లు ఫెయిలవడం కూడా అతనికి గ్లవ్స్ అందించడానికి కారణమే. గతేడాది వరకు వన్డేల్లో బాగానే రాణించిన పంత్ ఆ తర్వాత ఏమాత్రం రాణించడం లేదు. గత పది ఇన్నింగ్స్‌లలో ఇంగ్లండ్‌పై కొట్టిన సెంచరీ తప్ప అతని వన్డే కెరీర్‌లో చెప్పుకోవడానికి ఇంకేం లేదు. ఇక ఇషాన్ కిషన్ రికార్డు చూస్తే.. తను ఇప్పటి వరకు ఎనిమిది వన్డే ఇన్నింగ్సులు ఆడాడు. వీటిలో కిషన్ సగటు కేవలం 33.38 మాత్రమే. సంజూ శాంసన్ మంచి ఆప్షన్‌గా కనిపించినా.. అతను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. హార్దిక్ పాండ్యా జట్టులో చేరితే సంజూ తప్పుకోక తప్పదు.

లోయర్ ఆర్డర్‌లో చోటు కష్టం..

లోయర్ ఆర్డర్‌లో చోటు కష్టం..

స్పెషలిస్టు కీపర్ కోసం టీమిండియా లోయర్ ఆర్డర్‌లో చోటు దొరకడం కష్టం. ఎందుకంటే ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా తర్వాత కూడా ఆల్‌రౌండర్లు ఉంటేనే జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉంటేనే బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్లు బౌలింగ్ చేయడం దాదాపు అసాధ్యం. ఇక పేసర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ ఇద్దరూ లేదంటే ఇద్దర్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కు ఇస్తేనే మిగతా జట్టులో సమతుల్యం పెరుగుతుంది.

Story first published: Tuesday, December 6, 2022, 13:59 [IST]
Other articles published on Dec 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X