న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: కోల్‌కతా హిట్టర్లు హిట్ అవ్వలేదు.. ముంబై చేతిలో ఘోర పరాజయం!!

Mumbai Indians register 1st IPL win in UAE

దుబాయ్: ఐపీఎల్ 2020 భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై బోణీ చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై..కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై 49 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భీకర హిట్టర్ల జట్టుగా పేరున్న కోల్‌కతా జట్టు ముంబై బౌలర్ల ముందు నిలవలేకపోయింది.

ఆదిలోనే ఎదురుదెబ్బ:

ఆదిలోనే ఎదురుదెబ్బ:

భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే కోల్‌కతా తొలి వికెట్‌ కోల్పోయింది. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (7, 11 బంతుల్లో; 1×4) కిరన్ పొలార్డ్‌ చేతికి చిక్కాడు. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్‌ సునీల్ నరైన్‌ (9, 10 బంతుల్లో; 1×6) జేమ్స్ ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ డికాక్‌ చేతికి చిక్కాడు. 25 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో కోల్‌కతా ఇన్నింగ్స్ చప్పగా సాగింది. పరుగులు రావడమే గగనం అయింది.

కోల్‌కతా హిట్టర్లు ఫట్:

కోల్‌కతా హిట్టర్లు ఫట్:

ఈ సమయంలో కెప్టెన్‌ దినేష్ కార్తీక్‌ (30, 23 బంతుల్లో; 5×4).. నితీష్ రాణా (24, 18 బంతుల్లో; 2×4,1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తొలుత నిదానం ఆడినా.. ఆ తర్వాత గేర్‌ మార్చి వేగంగా పరుగులు సాధించారు. ఇద్దరు కలిసి 46 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించారు. కేకేఆర్‌ 71 పరుగుల వద్ద ఉండగా కార్తీక్‌ ఔటవ్వగా.. మరో ఆరు పరుగుల వ్యవధిలో రాణా కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. అయితే వారి హిట్టింగ్ మ్యాజిక్ ఇక్కడ పని చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్‌లో రసెల్ (11)‌, మోర్గాన్ (16)‌ను పెవిలియన్‌కు పంపించాడు. చివర్లో కమిన్స్‌ (33) మెరిశాడు.ముంబై బౌలర్లలో బుమ్రా ,ట్రెంట్‌ బౌల్ట్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌ తలో రెండు వికెట్లు సాధించారు.

 రెచ్చిపోయిన రోహిత్‌:

రెచ్చిపోయిన రోహిత్‌:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (47, 28 బంతుల్లో; 6×4, 1×6) ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆదిలోనే క్వింటన్ డికాక్‌ (1) వెనుదిరిగినా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

 ఆకట్టుకొని పొలార్డ్:

ఆకట్టుకొని పొలార్డ్:

11వ ఓవర్‌లో జట్టు స్కోరు 98 పరుగుల వద్ద సూర్యకుమార్‌ రనౌటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సౌరభ్‌ తివారి (21, 13 బంతుల్లో; 1×4, 1×6) మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆపై బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్యా (18, 13 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడాడు. పుల్‌షాట్లు, భారీ సిక్సర్లతో అలరించాడు. కొద్ది వ్యవధిలో ఇద్దరూ ఔట్ అయ్యారు. దీంతో ముంబై స్కోరు బోర్డు నెమ్మదించింది. చివరలో కీరన్ పొలార్డ్ (13*)‌, కృనాల్‌ పాండ్యా (1) బ్యాట్‌ ఝుళిపించకపోవడంతో ముంబై 195 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి రెండు వికెట్లు తీశాడు.

Story first published: Thursday, September 24, 2020, 7:11 [IST]
Other articles published on Sep 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X