న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs SRH: 148 కి.మీ. వేగంతో శ్రేయస్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఉమ్రాన్.. ఎగిరిగంతేసిన కోచ్ స్టెయిన్

KKR vs SRH: SRH bowler Umran Malik clean bowled Shreyas Iyer at a speed of 148 kmph. Bowling coach Dale Steyn expressed delight.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ దుమ్ములేపాడు. ఏకంగా 148 కిలో మీటర్ల వేగంతో బాల్ వేసి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఉమ్రాన్ మాలిక్ ఈ అద్భుత బౌలింగ్ చూసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఎగిరిగంతేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

148 కిలో మీట‌ర్ల వేగంతో వికెట్‌

స‌న్‌రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన 10వ ఓవ‌ర్‌ను కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆడ‌డానికి ఇబ్బందిప‌డ్డాడు. ఆ ఓవ‌ర్లో ప్ర‌తి బంతిని ఉమ్రాన్ దాదాపు 150 కిలో మీట‌ర్ల వేగంతో వేయ‌డంతో ఆ పేస్‌ను ఆడ‌డం శ్రేయ‌స్‌కు క‌ష్టంగా మారింది. ఉమ్రాన్ మాలిక్ 148 కిలో మీట‌ర్ల వేగంతో అద్భుతంగా యార్క‌ర్ వేసిన‌ చివ‌రి బంతిని ఎదుర్కొవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన శ్రేయ‌స్ అయ్య‌ర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ యార్క‌ర్ దెబ్బ‌కు మిడిల్ స్టంప్‌కు బంతి త‌గిలింది. దీంతో 3 స్టంప్స్ క‌దిలాయి. దీంతో క్రీజులో చ‌క్క‌గా కుదురుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ 28 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఔట‌య్యాడు.

ఎగిరిగంతేసిన డేల్ స్టెయిన్‌

ఎగిరిగంతేసిన డేల్ స్టెయిన్‌

ఉమ్రాన్ మాలిక్ ఆ అద్భుత బంతికి వికెట్ సాధించ‌డం చూసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఎగిరి గంతేయ‌డం కెమెరాల్లో రికార్డ‌యింది. ఆనందాన్ని ఆపులేక చిన్న‌పిల్లాడిలా ఎగిరి గంతులేస్తూ స్టెయిన్ సంబ‌రాలు చేసుకున్నాడు. కాగా ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస్ బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్ ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ఉమ్రాన్ మాలిక్‌ త‌న‌కు స్ఫూర్తి అని డేల్ స్టెయిన్ చెప్పాడు. కాగా ఈ సీజ‌న్‌లో ఉమ్రాన్ మాలిక్ ప్ర‌తి బంతిని 140 కిలో మీట‌ర్ల‌కుపైగా వేగంతో వేస్తున్నాడు. చాలా బంతులు 150 కిలో మీట‌ర్ల‌కు పైగా వేగంతో వేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే ఈ సీజ‌న్లో అత్య‌ధిక వేగంతో వేసిన బంతి కూడా ఉమ్రాన్ మాలిక్ పేరు మీద‌నే ఉంది.

తొలి బంతికే న‌ట్టూ వికెట్‌

తొలి బంతికే న‌ట్టూ వికెట్‌

అంత‌కుముందు మ్యాచ్‌లో ఐదో ఓవ‌ర్‌ను బౌలింగ్ చేసిన న‌ట‌రాజ‌న్ తొలి బంతికే కోల్‌క‌తా ఓపెన‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అద్భుత బౌలింగ్‌తో న‌ట‌రాజ‌న్ వేసిన బంతి ఏకంగా మిడిల్‌స్టంప్‌కు త‌గిలింది. దీంతో 13 బంతులు ఎదుర్కొన్న వెంక‌టేష్ అయ్య‌ర్ 6 ప‌రుగులే చేసి నిరాశ‌గా ఫెమిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన సునీల్ న‌రైన తొలి బంతికే సిక్సు కొట్టాడు. కానీ ఆ త‌ర్వాతి బంతికి న‌ట‌రాజ‌న్ మ‌ళ్లీ త‌న ప్ర‌తాపం చూపెట్టాడు. అద్భుతంగా పుల్‌టాస్ బాల్ వేశాడు. ఆ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించిన సునీల్ న‌రైన్ ఫీల్డ‌ర్ శ‌శాంక్ సింగ్‌కు దొరికిపోయాడు. దీంతో వేసిన తొలి ఓవ‌ర్లోనే న‌ట‌రాజ‌న్ రెండు వికెట్లు సాధించాడు. అటు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 31 ప‌రుగుల‌కు 3 టాప్ వికెట్లు కోల్పోయింది. అంటే పవ‌ర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

 తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీప‌ర్), పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), ఐడెన్ మాక్ర‌మ్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

Story first published: Friday, April 15, 2022, 21:02 [IST]
Other articles published on Apr 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X