న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కార్తిక్‌ బయ్యా.. నీ క్షురకుడికి ఏమైంది?.. డీకే కొత్త లుక్‌పై రసెల్‌ పంచ్!!

KKR trio Dinesh Karthik, Andre Russell, Sunil Narine share light banter on social media


కోల్‌కతా:
కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది వేసవిలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 సీజన్‌ నిరవధిక వాయిదా పడింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కూడా లేకపోవడంతో ఆటగాళ్లకు మంచి విశ్రాంతి దొరికింది. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని కొందరు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో గడుపుతుండగా.. మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సహచరులు, స్నేహితులతో లైవ్‌ సెషన్లు నిర్వహించి అనేక విషయాలు పంచుకుంటున్నారు.

పోర్న్‌ స్టార్‌గా మారిన సూపర్ కార్స్‌ మహిళా రేసర్‌!!

మ్యాచ్‌లు లేకపోయినా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు కూడా ఎప్పటికప్పుడు తమ పోస్టులతో అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్‌)‌ జట్టు తమ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌తో ఓ కార్యక్రమం నిర్వహించింది. 'టోటల్లీ స్టంప్డ్‌ బై డీకే' అనే కార్యక్రమానికి అతడిని వ్యాఖ్యాతగా చేసి వీడియో సెషన్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కార్తిక్ తన తొలి ఎపిసోడ్‌ను వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఆండ్రూ రసెల్‌, సునీల్‌ నరైన్‌తో కలిసి నిర్వహించాడు. అభిమానుల కోసం ఈ సరదా సంభాషణను కేకేఆర్‌ యాజమాన్యం ట్విటర్‌లో పంచుకుంది.

వీడియోలో తొలుతదినేశ్‌ కార్తిక్‌ను చూసిన ఆండ్రూ రసెల్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. డీకే జుట్టు, గడ్డం చూసి నమ్మలేకపోయాడు. 'కార్తిక్‌ బయ్యా నీ క్షురకుడికి ఏమైంది?' అని సరదాగా అన్నాడు. రసెల్‌ మాటలకు డీకే, నరైన్‌ నవ్వుకున్నారు. తర్వాత డీకే స్పందిస్తూ... భారత్‌లో లాక్‌డౌన్‌ వేళ అత్యవసర పనులకే అనుమతించారన్నాడు. దీనికి రసెల్‌ ఓ పంచ్ ఇచ్చాడు. 'రేజర్‌ బ్లేడ్‌ తెచ్చుకోడానికి కూడా అనుమతించట్లేదా?' అని ప్రశ్నించాడు. చివరగా డీకే కొత్త లుక్‌ బాగుందని, తనకు నచ్చిందని రసెల్‌ పేర్కొన్నాడు.


అనంతరం సునీల్‌ నరైన్‌ స్పందిస్తూ... ఈ కొత్త లుక్‌ను ఐపీఎల్ 2020‌లో కొనసాగించాలని కోరాడు. ఆ తర్వాత కార్తిక్‌.. రసెల్‌ను ఆటపట్టించాడు. నీకు హెలికాఫ్టర్‌ కొనాలని ఉందట నిజమేనా? అని అడిగాడు. దానికి స్పందించిన రసెల్‌‌.. హెలికాఫ్టర్‌ కాదని, తనకు ఎగిరే కారు కొనాలనుందన్నాడు. ఎగిరే కారుంటే ట్రాఫిక్‌ బెడద లేకుండా ప్రయాణించొచ్చని రసెల్‌ చెప్పాడు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీనిబీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. అయితే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వాయిదా వేయాలని చూస్తుండటంతో.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతోంది.

Story first published: Tuesday, June 9, 2020, 13:35 [IST]
Other articles published on Jun 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X