హాట్ కేక్..వెంకటేష్ అయ్యర్: రూ.20 లక్షలతో ఐపీఎల్ డెబ్యూ..ఏడాదిలోపే 8 కోట్లతో రిటెన్షన్

IPL 2022 Retention : Venkatesh Iyer's 4000 Percent Pay Hike || Oneindia Telugu

ముంబై: వెంకటేష్ అయ్యర్.. కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్. ఇండియన్ ప్రీిమియర్ లీగ్ రిటెన్షన్‌లో మారుమోగిపోతోన్న పేరు. ఎలాంటి గుర్తింపు లేకుండా, ఓ అనామకుడిగా ఐపీఎల్ 2021లో అడుగు పెట్టాడు. సంవత్సరం తిరిగే సరికి.. అతనే దశ మారిపోయింది. 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో కేరీర్ ఆరంభించిన వెంకటేష్ అయ్యర్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఏకంగా ఎనిమిది కోట్లకు చేరింది. 4,000 రెట్లు అతని శాలరీ పెరిగింది. ఎనిమిది కోట్ల రూపాలతో కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ అతణ్ని రిటెయిన్ చేసుకుంది.

కష్టపడేవాడికి ఒక్క అవకాశం ఇచ్చినా..

కష్టపడేవాడికి ఒక్క అవకాశం ఇచ్చినా..

ఐపీఎల్ 2021లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ అయ్యర్. కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ కేరీర్‌ను ఆరంభించాడు. బేస్ ప్రైజ్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించలేదు కేకేఆర్ మేనేజ్‌మెంట్. బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలకు అతన్ని కొనుగోలు చేసింది. జట్టులోకి తీసుకుంది. కష్టపడే మనస్తత్వం ఉన్న వాడికి ఒక్క అవకాశం ఇచ్చినా చాలు అనడానికి ఓ నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడతను. అదృష్టం కూడా అతనికి కలిసి వచ్చింది. ఐపీఎల్ ఇచ్చిన ఊపుతో జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడీ ఆల్‌రౌండర్.

ఐపీఎల్ 2021లో ఆల్‌రౌండర్‌గా..

ఐపీఎల్ 2021లో ఆల్‌రౌండర్‌గా..

ఐపీఎల్ 2021లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆల్‌రౌండర్‌గా ఎదిగాడతను. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లను ఆడాడు. 370 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోర్ 67 పరుగులు. 37 ఫోర్లు.. 14 సిక్సర్లు ఇందులో ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 41.11. స్ట్రైక్ రేట్ 128.47.

ఈ 10 మ్యాచ్‌లల్లో నాలుగు అర్ధసెంచరీలను బాది అవతల పడేశాడు. ఐపీఎల్‌లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ అయ్యర్. బౌలర్‌గానూ సత్తా చాటాడు. 8.3 ఓవర్లను సంధించాడు. 69 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 2/29 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.

టీ20 ఇంటర్నేషనల్స్‌లోనూ ఎంట్రీ..

టీ20 ఇంటర్నేషనల్స్‌లోనూ ఎంట్రీ..

వెంకటేష్ అయ్యర్ కేరీర్ ఐపీఎల్‌ వరకే పరిమితం కాలేదు. జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో కేరీర్ మొదలు పెట్టిన అతి కొద్దిరోజుల్లోనే జాతీయ జట్టులో చేరిన ప్లేయర్లలో అతనూ ఒకడు. రోహిత్ శర్మ కేప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో అతను ఆడాడు. మూడు మ్యాచ్‌లల్లో 36 పరుగులు చేశాడు.

హయ్యెస్ట్ స్కోర్ 20 పరుగులు. ఒక్క మ్యాచ్‌లో బౌలింగ్ చేసి, ఓ వికెట్ పడగొట్టాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసే వెంకటేష్ అయ్యర్.. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్.

కేకేఆర్ రిటెన్షన్..

కేకేఆర్ రిటెన్షన్..

కోల్‌కత రిటెన్షన్ చేసుకున్న నలుగురు ప్లేయర్లలో వెంకటేష్ అయ్యర్ ఒకడు. అతన్ని వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్ట పడలేదు. కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ సహా అందర్నీ వదులకుంది. ఆల్‌రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్‌ను తన వద్దే ఉంచుకుంది. మిగిలిన వారందరినీ పంపించేసింది. ఐపీఎల్ 2022 కోసం నిర్వహించే మెగా వేలంపాట సందర్భంగా కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటుంది. జనవరిలో మెగా ఆక్షన్ నిర్వహించే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్ ఓపెనర్‌గా జట్టులో కొనసాగుతాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, December 2, 2021, 11:56 [IST]
Other articles published on Dec 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X