న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయాలతో బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు సెండాఫ్ ఇవ్వాలని కేకేఆర్ పట్టుదల

KKR looking to give send off to McCullum with winning in last two matches

కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ గైడెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మే 14న శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడనుంది. మెక్‌కల్లమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగిసే టైంకి ఇంగ్లాండ్‌కు వెళ్లి బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో మెక్‌కల్లమ్ మార్గదర్శకత్వంలో కేకేఆర్ తన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో మెక్కల్లమ్‌కు విజయాలతో సెండాఫ్ ఇవ్వాలని కేకేఆర్ టీం యోచిస్తోంది. మెక్‌కల్లమ్ కేకేఆర్ టీం విజయాల్లో కోచ్‌గా కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్ ప్రస్తుత కోచ్‌ సిల్వర్‌వుడ్‌ స్థానంలో కొత్త కోచ్‌గా మెక్‌కల్లమ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. వరుసగా టెస్టు సిరీస్‌ వైఫల్యాలు ఇంగ్లాండ్‌ను కుదిపేసిన నేపథ్యంలో జో రూట్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) బెన్‌ స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఇక కొత్త కెప్టెన్‌, కొత్త కోచ్‌‌తో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ త్వరలో ఆడబోతుంది. ఈ సిరీస్ గెలిచి ఇంగ్లాండ్ మళ్లీ గాడిలో పడుతుందో లేదో చూడాలి. మెక్‌కల్లమ్‌ నాలుగేళ్ల పాటు ఇంగ్లాండ్ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేయనున్నాడు. ఇందుకు గాను రూ.18కోట్ల పైచిలుకు మొత్తంతో ఈసీబీ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది.

కోల్‌కత నైట్‌రైడర్స్‌‌కు నేటి మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం. ప్రస్తుతం ఈ జట్టు వద్ద 10పాయింట్ల ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో నెగ్గిన కేకేఆర్.. తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌ను పక్కన పెడితే.. కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఉన్నది ఇంకొక్కటే. తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడాల్సి ఉంది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ రెండింటినీ గెలిస్తే 14పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉండొచ్చు.

Story first published: Saturday, May 14, 2022, 15:15 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X