న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊతప్ప-సర్ఫరాజ్ గొడవపై గంభీర్: 'హై ఓల్టేజ్ టోర్నీ, ఇలాంటివి మామూలే'

By Nageswara Rao

కోల్‌కత్తా: ఏప్రిల్ 11న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరుకు మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం ఓపెనర్ రాబిన్ ఊతప్ప, సర్ఫరాజ్ మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై కోల్ కత్తా కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

ఐపీఎల్ లాంటి ఉత్కంఠ భరిత టోర్నమెంట్‌లో ఇలాంటి సంఘటనలు మామూలేనంటూ కోల్‌కత్తా ఓపెనర్ రాబిన్ ఊతప్పను వెనుకేసుకొచ్చాడు. ఈ ఘటనలో తప్పేమీలేదని అన్నాడు. ఇలాంటి ఘటనలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వకూడదని కోరాడు.

 KKR captain Gambhir speaks on Uthappa-Sarfaraz scuffle at IPL 2015

సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మైదానంలో నేను దూకుడుగా వ్యవహారిస్తానని చెప్పాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలో ఇలాంటివి సహాజమని అన్నాడు. మీడియా వీటన్నింటిని తేలికగా తీసుకోవాలని సూచించాడు. అసలు ఆరోజు ఏం జరిగిందంటే, శనివారం మ్యాచ్ తర్వాత ఓపెనర్ రాబిన్ ఊతప్ప సైట్ స్క్రీన్ వెనుక 17 ఏళ్ల సర్ఫరాజ్ కాలర్ పట్టుకొని తిట్టనిట్లు సమాచారం.

ఇది గమనించిన బెంగుళూరు ఆటగాళ్లు ఏబీ డెవిలియర్స్, దిండా పరుగెత్తుకుంటూ వెళ్లి సర్ఫరాజ్‌ను విడిపించారని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటనేది తెలియరాలేదు. అయితే ఈ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ కూడా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X