న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర క్రీడల మంత్రి

Kiren Rijiju Welcomes BCCIs Decision to Come Under NADA Ambit

హైదరాబాద్: నాడా(నేషనల్‌ యాంటి డోపింగ్‌ ఏజన్సీ) ప‌రిధిలోకి బీసీసీఐ రావ‌డాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు స్వాగ‌తించారు. తద్వారా క్రీడ‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుందని చెప్పారు. భారత క్రికెటర్లను నాడా కిందకు తీసుకొచ్చే అంశంపై క్రీడాశాఖ కార్యదర్శి ఆర్‌ఎస్‌ జులానియా, నాడా డీజీ నవీన్ అగర్వాల్‌లు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, బోర్డు జీఎమ్(క్రికెట్ ఆపరేషన్స్) సాబా కరీమ్‌ను శుక్రవారం సమావేశమయ్యారు.

మొండిచేయి: గేల్ ఒకటి తలిస్తే.. విండిస్ బోర్డు మరోకటి తలచిందిమొండిచేయి: గేల్ ఒకటి తలిస్తే.. విండిస్ బోర్డు మరోకటి తలచింది

ఈ సమావేశంలో నాడా యాంటీ డోపింగ్ పాలసీ విధానానికి కట్టుబడి ఉంటామని బోర్డు లిఖితపూర్వకంగా ఇచ్చింది. దీంతో బీసీసీఐ ఓ మంచి నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని మంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. క్రీడ‌లు, క్రీడాకారుల స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉండ‌డాన్ని స‌హిచంలేన‌ని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నాడా కిందకు రావడంతో పాటు ఇకపై జాతీయ స్పోర్ట్స్ సమాఖ్య(ఎన్‌ఎస్‌ఎఫ్)గా బీసీసీఐ ఏర్పడనుంది.

ఈ కారణంగా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధి కింద బీసీసీఐని ప్రశ్నించే అవకాశం కూడా దక్కింది. బోర్డులో జరుగుతున్న ఏ విషయం గురించి అయినా ఆర్టీఐ కింద సమాచారం పొందే అవకాశం లభిస్తుంది. ఆటగాళ్లందరూ సమానమేనని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆర్‌ఎస్‌ జులానియా పేర్కొన్నారు.

ఆఖరి బంతికి సిక్స్: 55 బంతుల్లో సెంచరీ, టీ20 బ్లాస్ట్‌లో బాబర్ అజాం రికార్డుఆఖరి బంతికి సిక్స్: 55 బంతుల్లో సెంచరీ, టీ20 బ్లాస్ట్‌లో బాబర్ అజాం రికార్డు

అంతేకాదు ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న సంస్థ కాదని, అలాంటిది క్రికెటర్లకు నాడా చేతుల మీదుగా డోపింగ్ పరీక్షలకు చేయడానికి ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించింది. ఇటీవల ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్‌ ఉత్ప్రేరకాన్ని వాడిన యువ క్రికెటర్‌ పృథ్వీ షా 8 నెలల నిషేదానికి గురయ్యాడు.

అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో తాను వేసుకున్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని పృథ్వీ షా ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడాశాఖ ఇటీవల బీసీసీఐకి లేఖ రాసింది.

అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని బోర్డుకు సూచించింది. బీసీసీఐ మాత్రం తాము డోపింగ్‌ టెస్టులను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నాయని పేర్కొంది. అయితే, ఇందుకు కేంద్ర క్రీడాశాఖ ఒప్పుకోలేదు. బీసీసీఐ సమ్మతితో క్రికెటర్లందరినీ నాడా పరీక్షిస్తుందని క్రీడా కార్యదర్శి జులానియా అన్నారు.

ఆయన మాట్లాడుతూ "డోప్ టెస్టింగ్ కిట్ల నాణ్యత, పాథాలజిస్టుల సామర్థ్యం, నమూనా సేకరణ వంటి మూడు సమస్యలను బిసీసీఐ మన ముందు లేవనెత్తింది. బోర్డు కోరిన వాటికి మేము సమ్మతించాం. కానీ సమకూర్చేందుకు డబ్బులు వసూలు చేస్తాం. అలాగనీ దేశంలోని అన్ని ఎన్‌ఎస్‌ఎఫ్‌ల లాగే బీసీసీఐకి సౌకర్యాలు కల్పిస్తాం అందులో ఎలాంటి తేడా ఉండదు. ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే" అని అన్నారు.

Story first published: Saturday, August 10, 2019, 15:22 [IST]
Other articles published on Aug 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X