న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సునీల్ గవాస్కర్ చెత్త బ్యాట్స్‌మెన్.. కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు!!

Kiran More says Sunil Gavaskar one of the worst players I’ve ever seen in the nets
Sunil Gavaskar Was One of The Worst Player in The Nets : Kiran More || Oneindia Telugu

న్యూఢిల్లీ: సునీల్ గవాస్కర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ, భారత క్రికెట్‌లో ఒకప్పటి మేటి ఆటగాళ్లలో గవాస్కర్ కూడా ఒకరు. భారత క్రికెటర్లలో 10వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ గవాస్కర్. కెరీర్‌లో 34 టెస్టు సెంచరీలు నమోదు చేశారు. అందుకే అభిమానులంతా అతడిని 'లిటిల్ మాస్టర్' అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గవాస్కర్‌ చెత్త బ్యాట్స్‌మెన్ అని భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెరెనా విలియ‌మ్స్‌ కొత్త పార్ట్న‌ర్ ఎవరో తెలుసా?!!సెరెనా విలియ‌మ్స్‌ కొత్త పార్ట్న‌ర్ ఎవరో తెలుసా?!!

నెట్స్‌లో చెత్త బ్యాట్స్‌మన్:

నెట్స్‌లో చెత్త బ్యాట్స్‌మన్:

టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ నెట్స్‌లో చాలా చెత్త బ్యాట్స్‌మన్‌ అని అతని సహచర ఆటగాడు కిరణ్ మోరే అభివర్ణించారు. గవాస్కర్ నెట్స్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు, మరుసటి రోజు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఎలా పరుగులు చేయగలననే భయంతో ఉండేవాడని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మోరే మాట్లాడుతూ... 'నెట్స్‌లో నేను చూసిన ఆటగాళ్లందరిలో చాలా చెత్త ఆటగాడు గవాస్కర్‌. అతను ఎప్పుడూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. మరుసటి రోజు టెస్ట్ మ్యాచ్లో తన ఆటతో 99.9 శాతం భిన్నంగా ఉంటాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయకుండా ఎలా స్కోర్‌ చేయగలుగుతాడని అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. మైదానంలోకి దిగిన తర్వాత తెలిసేది అతడు ఎంత సీరియస్‌గా బ్యాటింగ్‌ చేస్తాడో అని' తెలిపారు.

గ్లౌజులు విసిరికొట్టేవాడు:

గ్లౌజులు విసిరికొట్టేవాడు:

'సునీల్ గవాస్కర్‌కు దేవుడు ఇచ్చిన ఉత్తమ బహుమతి అతడి ఏకాగ్రత. అతను ఏ విధమైన ఏకాగ్రతను కలిగి ఉన్నాడో నమ్మడం చాలా కష్టం. ఒకసారి అతను తన జోన్లోకి వెళితే, అతని చుట్టూ ఎవరూ రాలేరు. అతని దృష్టి ఎప్పుడూ క్రికెట్ మీదనే ఉండేది. నేను భారత జట్టులోకి వచ్చినప్పుడు వెస్ట్ జోన్ కోసం చాలా ఆడాను. వాంఖడేలో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. గవాస్కర్ 40 పరుగులు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరూ లేరు. అప్పుడు గ్లౌజులు విసిరికొట్టి చాలా విచారకరంగా ఉన్నాడు' అని మోరే చెప్పారు.

డకౌట్ ఔటైతే ఫీలవ్వడు కానీ:

డకౌట్ ఔటైతే ఫీలవ్వడు కానీ:

'సునీల్ గవాస్కర్ డకౌట్ లేదా 5-10 పరుగుల వద్ద ఔటైతే ఏమీ ఫీలవ్వడు. కానీ గంట క్రీజులో నిలిచి 30-40 పరుగుల వద్ద ఔటైతే మాత్రం డ్రెస్సింగ్ రూములోకి వచ్చి గ్లౌవ్స్‌ని విసిరేసేవాడు. 40 వద్ద ఔట్‌ కావడమేంటి? అని పెద్దగా అరిచేవాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ స్కోర్లు చేయకుండా ఔటవడం అతనికి నచ్చేది కాదు' అని కిరణ్ మోరే వివరించారు. ప్రపంచ క్రికెట్‌లో గవాస్కర్ ఓ అద్భుత ఆటగాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

గొప్ప ఓపెనర్లలో ఒకరు:

గొప్ప ఓపెనర్లలో ఒకరు:

సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో గొప్ప ఓపెనర్లలో ఒకరుగా నిలిచారు. 1970, 1980లలో భారత బ్యాటింగ్‌లో ప్రధానమైన గవాస్కర్.. సుదీర్ఘ ఫార్మట్‌ చరిత్రలో 10,000 పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచారు. 1983లో వరల్డ్‌ కప్‌ సాధించిన టీమిండియా జట్టు సభ్యుడు కూడా. గవాస్కర్ భారత్ తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు.

Story first published: Saturday, July 4, 2020, 18:16 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X