న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టీ20: వాంఖడెలో పొలార్డ్‌కు అపార అనుభవం, కోహ్లీ Vs విలియమ్స్!

Kieron Pollards IPL experience at Wankhede will benefit West Indies bowlers: Phil Simmons


హైదరాబాద్: ఆఖరి టీ20లో కెప్టెన్ కీరన్ పొలార్డ్ అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరిస్‌లో వాంఖడె వేదికగా టీమిండియాతో బుధవారం ఆఖరి టీ20 జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది.

ఈ నేపథ్యంలో మూడో టీ20కి ముందు హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ మాట్లాడుతూ "ఈ వేదికలో పొలార్డ్‌ ఎక్కువ క్రికెట్‌ ఆడాడు. మిగతా క్రికెటర్లకు పెద్దగా అనుభవం లేదు. ఈ స్టేడియంలో అతడు సాధించిన అనుభవం జట్టుకు ఎంతో ముఖ్యం. పదేళ్లుగా అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు" అని అన్నాడు.

రెండో టీ20లో శాంసన్‌కు దక్కని చోటు.. మండిపడుతున్న ఎంపీ శశిథరూర్‌!!రెండో టీ20లో శాంసన్‌కు దక్కని చోటు.. మండిపడుతున్న ఎంపీ శశిథరూర్‌!!

పొలార్డ్‌కు తెలుసు

పొలార్డ్‌కు తెలుసు

"పిచ్‌, వాతావరణం ఎలా ఉంటుందో అతడికి తెలుసు. అతడు కచ్చితంగా మా బౌలర్లకు ఉపయోగపడతాడు. యువ క్రికెటర్లకు అతడు మార్గనిర్దేశం చేయగలడు. క్యాచ్‌లు జారవిడిస్తే మ్యాచ్‌ల్లో నెగ్గలేం. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఈ విషయంలో సాకుల్ని నేను అంగీకరించను" అని తేల్చి చెప్పాడు.

క్యాచ్‌ వదిలేశారంటే అది మీ తప్పు

క్యాచ్‌ వదిలేశారంటే అది మీ తప్పు

"క్యాచ్‌ వదిలేశారంటే అది మీ తప్పు. ఫ్లడ్‌లైట్ల వెలుతురును మీరు సాకుగా చెప్పొచ్చు. కానీ క్యాచ్‌లను నేలపాలు చేయకుండా ఉండేందుకు మరింత కష్టపడాలి. అంతకుముందు నేను (కోచ్‌గా) ఉన్నప్పుడు జాసన్ (హోల్డర్) వన్డేల్లో పెద్దగా రాణించలేదు. అయితే, పొలార్డ్‌ ఆటగాళ్లతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నాడు" అని సిమ్మన్స్ తెలిపాడు.

ఆటగాళ్ల నుంచి అతనేం కోరుకుంటున్నాడో

ఆటగాళ్ల నుంచి అతనేం కోరుకుంటున్నాడో

"ఆటగాళ్ల నుంచి అతనేం కోరుకుంటున్నాడో స్పష్టంగా చెబుతున్నాడు. పొలార్డ్ మంచివాడు, ముందుగానే అర్ధం చేసుకుని జట్టు కోసం ప్రతిదీ ఇస్తాడనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఇక, షెల్డన్‌ కాట్రెల్‌ స్వింగ్‌ చేస్తున్నప్పుడు బంతిపై నియంత్రణ ఉంచుకోవాలి. అతనికి తన ఆట తెలుసు. అతను ఈ జట్టుకు విలువైన ఆస్తి" అని సిమ్మన్స్‌ అన్నాడు.

కోహ్లీ vs విలియమ్స్

కోహ్లీ vs విలియమ్స్

ఇక, ఈ సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ కెస్రిక్‌ విలియమ్స్‌ మధ్య కవ్వింపులు బాగున్నాయని అన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20లో కోహ్లీ నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో విలియమ్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండో టీ20లో కోహ్లీని ఔట్ చేసినా విలియమ్స్ సంబరాలు చేసుకోకుండా సైలెన్స్ అంటూ నోటిపై వేలు వేసుకున్నాడు.

Story first published: Wednesday, December 11, 2019, 11:53 [IST]
Other articles published on Dec 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X