న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సిరిస్ గెలుస్తాం, ఎలాంటి భ్రమల్లో లేం: వార్మప్ మ్యాచ్ రద్దుపై కోహ్లీ

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో టెస్టు సిరీస్‌కు ఒరిగేదేమీ లేనందునే వార్మప్‌ మ్యాచ్‌ వద్దనుకున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'న్యూలాండ్స్‌ పిచ్‌కు వార్మప్‌ పిచ్‌కు అసలే మాత్రం సంబంధం లేదు. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్‌ నిర్వహిస్తారో మాకు బాగా తెలుసు. కనీసం 15 శాతమైనా సరిపోలని పిచ్‌ అది. రెండు రోజులు వృథా చేసుకోవడం కంటే నెట్స్‌లో శ్రమించడమే ఉత్తమం. పైగా సిరీస్‌కు ముందు మానసిక ప్రశాంతత కూడా అవసరమని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని కోహ్లీ చెప్పాడు.

సవాల్‌కు పూర్తిగా సిద్ధమయ్యాం

సవాల్‌కు పూర్తిగా సిద్ధమయ్యాం

ప్రస్తుతం ఉన్న 17 మందిలో 13 మంది 2013-14 సీజన్‌లో ఇక్కడ ఆడారని... అనుభవం గడించిన వీరంతా తప్పకుండా నాణ్యమైన ఆట ఆడతారనే విశ్వాసాన్ని కోహ్లీ వ్యక్తం చేశాడు. ‘ఇక్కడ ఎదురయ్యే సవాల్‌కు పూర్తిగా సిద్ధమయ్యాం. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయంలో మేం ఎలాంటి భ్రమల్లో లేం. ఆడే విషయంలో కూడా మాకు ఎలాంటి అయోమయం లేదు. సిరీస్‌ ఆరంభం కానవ్వండి. జనవరి 5న మీకే తెలుస్తుంది. ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు' అని కోహ్లీ తెలిపాడు.

 భారత్‌ ఇప్పటివరకు ఒక్క సిరిస్ కూడా గెలవలేదు

భారత్‌ ఇప్పటివరకు ఒక్క సిరిస్ కూడా గెలవలేదు

దక్షిణాఫ్రికాలో భారత్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేదు. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు తమ ఆట ఎంతో మెరుగైందని కోహ్లీ అన్నాడు. 'గత నాలుగేళ్లు జట్టుగా మేం ఎంతో మారాం. వ్యక్తిగతంగా కూడా ఎత్తుపల్లాలు ఎన్నో చూశా. ఇప్పుడున్న స్థితిలో జట్టు చాలా సౌకర్య వంతంగా ఉంది. ఆటగాళ్లు కూడా రాటుదేలారు' అన్నాడు.

 కోహ్లీ-డివిలియర్స్‌కు మధ్య జరిగే సిరిస్ కాదు

కోహ్లీ-డివిలియర్స్‌కు మధ్య జరిగే సిరిస్ కాదు

అలాగే ఇది తనకు, డివిలియర్స్‌కు మధ్య జరిగే సిరీస్‌ కాదని గుర్తుచేశాడు. ఈ సిరీస్‌లో ఇద్దరమే ఆడడం లేదని కోహ్లీ చెప్పాడు. తన బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ సహచరుడంటే తనకు ఎంతో గౌరవమని అన్నాడు. దక్షిణాఫ్రికాలో పిచ్‌లు ఎక్కువగా పేస్‌, బౌన్స్‌తో ఉంటాయనే విషయం తమకు తెలుసని కోహ్లీ అన్నాడు.

గత పర్యటనలో వారి అంచనాలను తారుమారు చేశాం

గత పర్యటనలో వారి అంచనాలను తారుమారు చేశాం

గత పర్యటనలో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్టులో తామెలా ఆడామో ఓసారి గుర్తు చేసుకోవాలని కోహ్లీ ఈ సందర్భంగా అన్నాడు. ‘భారత్‌లో కాకుండా ఇక్కడి వికెట్‌ విభిన్నంగా ఉంటుందని తెలుసు. చివరిసారి వచ్చినప్పుడు కూడా ఈ పిచ్‌ల గురించి, షార్ట్‌ బంతులను ఎదుర్కోవడంలో మేం ఇబ్బంది పడతామని మాట్లాడారు. కానీ మేం వారి అంచనాలను తారుమారు చేశాం' అని కోహ్లీ అన్నాడు.

 ఈ సిరీస్‌ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన కోహ్లీ

ఈ సిరీస్‌ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన కోహ్లీ

ఈ సిరీస్‌ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. 'జట్టులో నాణ్యమైన పేసర్లు, మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం మంచి సమతుల్యంతో కనబడుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టెస్టు మ్యాచ్‌లు గెలిచే సామర్థ్యం మా జట్టుకు ఉంది. ప్రస్తుతానికి సెషన్ల వారిగా గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యర్థి జట్టు చరిత్రను పరిగణనలోకి తీసుకోకుండా మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తే సరిపోతుంది. విజయాలు వాటంతట అవే వస్తాయి' అని కోహ్లీ అన్నాడు.

Story first published: Sunday, December 31, 2017, 11:00 [IST]
Other articles published on Dec 31, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X