న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!

Kevin Pietersen says Disrespectful to Indian team if England do not play best XI
Ind vs Eng Test Series : India Announce Squad For First Two Tests Against England | Oneindia Telugu

న్యూఢిల్లీ: పటిష్టమైన టీమిండియాతో పోటీపడేందుకు ఇంగ్లండ్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కెవిన్‌ పీటర్సన్‌ సూచించాడు. అలా చేయకుంటే భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ అభిమానులను అగౌరవపరిచినట్టేనని తెలిపాడు. ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ ప్రకారం తొలి రెండు టెస్టులకు బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌, పేసర్‌ మార్క్‌ వుడ్‌లకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈసీబీ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ కూడా ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

బెస్ట్ టీమ్‌తో ఆడాలి..

'భారత్‌తో జరిగే తొలి టెస్టు కోసం ఇంగ్లండ్‌ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత్‌ను వారి దేశంలోనే ఓడించడమంటే ఆసీస్‌ గడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసినట్టుగానే భావించాలి. ఉత్తమ జట్టుతో ఆడకపోతే అది ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌నే కాకుండా బీసీసీఐని కూడా అగౌరవపరిచినట్టవుతుంది. బెయిర్‌స్టోతో పాటు తుది జట్టులో స్టువర్ట్ బ్రాడ్‌, జేమ్స్ అండర్సన్‌ ఉండాల్సిందే. భారత్‌తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని స్టార్‌ క్రికెటర్లు భావిస్తుంటారు. తద్వారా వారికి ఐపీఎల్‌లో చోటు దక్కుతుంది. అక్కడ వారి అర్హతకు తగినట్టుగా డబ్బు సంపాదించగలుగుతారు. ఏ ఆటగాడికైనా డబ్బు అవసరమే కదా'అని పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు.

పునరాలోచించాలి..

పునరాలోచించాలి..

బెయిర్‌స్టోకు విశ్రాంతినివ్వడంపై ఇంగ్లండ్‌ బోర్డు పునరాలోచించాలని మాజీ కెప్టెన్‌ నాజర్ హుస్సేన్ అన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో బెయిర్‌స్టో 47, 35*పరుగులు చేశాడని, అలాంటి ఆటగాడిని భారత్‌తో రెండు టెస్టులకు దూరం చేయడంపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటారని, అందులో బెయిర్‌స్టో ఒకడని హుస్సేన్‌ వివరించాడు. అతడిని పక్కన పెట్టడం విచారించాల్సిన విషయమని తెలిపాడు.

విశ్రాంతి అవసరమే..

విశ్రాంతి అవసరమే..

'కరోనా వైరస్‌ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వరుసగా క్రికెట్‌ ఆడుతున్నారు. ఐపీఎల్‌ తర్వాత దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇప్పుడు భారత్‌.. ఆపై మళ్లీ ఐపీఎల్‌ ఇలా విశ్రాంతి లేకుండా పోయింది. ఇది కచ్చితంగా వారికి మంచిది కాదు. దీని గురించి సెలెక్టర్లు పునరాలోచించాలి. ఈ విషయంలో నేనెవరినీ తప్పుబట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం వారికి కూడా అంత తేలిక కాదు. కానీ, టీమిండియాతో ఆడేటప్పుడు మేటి ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది' అని హుస్సేన్‌ పేర్కొన్నాడు.

యాషెస్ అయితే ఇలానే చేసేవారా?

యాషెస్ అయితే ఇలానే చేసేవారా?

'ఒకవేళ ఇదే లంక పర్యటన తర్వాత ఇంగ్లండ్‌ జట్టు నేరుగా ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో తలపడితే ఇలాగే చేసేవారా?మనం ఉత్తమ జట్టును పంపించకపోమా?అలాంటప్పుడు టీమ్‌ఇండియాతో తొలి మ్యాచ్‌కు ఎందుకు మంచి జట్టును పంపించలేము?ఇదంతా సమన్వయం చేసుకొని ముందుకు సాగాల్సిన పని' అని మాజీ సారథి అభిప్రాయపడ్డాడు. కాగా, ఆటగాళ్లకు పనిభారం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అందరికీ సమాన రీతిలో విశ్రాంతినిస్తుంది. ఈ నేపథ్యంలోనే బెయిర్‌స్టోను భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు దూరం పెట్టారు. ఇది సరికాదని హుస్సేన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

Story first published: Monday, January 25, 2021, 12:39 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X