న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

61 ఏళ్ల తర్వాత మహారాజ్ రికార్డు: 124కే కుప్పకూలిన సఫారీలు

By Nageshwara Rao
 Keshav Maharaj second South African to take 9 wickets in a Test innings

హైదరాబాద్: శ్రీలంక పర్యటనలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ సఫారీ స్పిన్నర్‌ 9 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సాధించాడు.

61 ఏళ్ల తర్వాత ఈ రికార్డును కేశవ్‌ మహారాజ్ అందుకోవడం ఒక విశేషం అయితే, లంక గడ్డపై ఓ విదేశీ బౌలర్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం. 1957లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆఫ్‌ స్పిన్నర్‌ హగ్‌ టైఫీల్డ్‌ ఈ ఘనతను సాధించాడు. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో హగ్‌ టైఫీల్డ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశాడు.

హగ్‌ టైఫీల్డ్‌ రికార్డుని సమం చేసిన మహారాజ్

హగ్‌ టైఫీల్డ్‌ రికార్డుని సమం చేసిన మహారాజ్

తాజాగా, ఇప్పుడు ఈ రికార్డుని కేశవ్ మహారాజ్ సమం చేశాడు. మరోవైపు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో జేసీ లేకర్‌ (ఇంగ్లాండ్‌), అనిల్‌ కుంబ్లే (భారత్‌)లు పది వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కేశవ్ మహారాజ్ దెబ్బకు శ్రీలంక 338 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది.

బౌలర్లు రాణించినా బ్యాట్స్‌మెన్ విఫలం

బౌలర్లు రాణించినా బ్యాట్స్‌మెన్ విఫలం

బౌలర్లు రాణించినా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34.5 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్(48), క్వింటన్ డికాక్(32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్

సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లను ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాట్స్‌మెన్ తెగ ఇబ్బంది పడుతున్నారు.

తొలి టెస్టులో 200 ప‌రుగులు కూడా చేయని సఫారీలు

తొలి టెస్టులో 200 ప‌రుగులు కూడా చేయని సఫారీలు

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 200 ప‌రుగులు కూడా చేయ‌ని సంగతి తెలిసిందే. కాగా, లంక బౌలర్లలో అఖిల ధనంజయ(5/52), దిల్రువాన్ పెరీరా(4/40) అద్భుత ప్రదర్శన చేశారు. వైవిధ్యమైన బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. క్రీజులో కుదురుకునే సమయం కూడా ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

స్పిన్నర్లకు అనుకూలిస్తోన్న లంక పిచ్‌లు

స్పిన్నర్లకు అనుకూలిస్తోన్న లంక పిచ్‌లు

పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించడంతో స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 338 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 124కే కుప్పకూలడంతో లంకకు 214 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో రోజు ఆట‌ ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.

Story first published: Saturday, July 21, 2018, 16:51 [IST]
Other articles published on Jul 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X