న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kieron Pollard సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు! షాక్‌లో ముంబై ఫ్యాన్స్!

Kerion Pollard Retired

ముంబై: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా పొలార్డ్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపిన అతను15 ఏళ్ల పాటు వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నాడు.

'అనేక చర్చల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. చాలా మంది యువకుల్లానే నేను 10 ఏళ్ల వయసులో వెస్టిండీస్ జట్టుకు ఆడాలని కలలు కన్నాను. ఆ కలను నెరవేర్చుకోవడమే కాకుండా 15 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు వన్డే, టీ20ల్లో ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉంది.

2007లో నా చిన్న నాటి హీరో బ్రియాన్ లారా నాయకత్వంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం నేను ఎన్నటికీ మరిచిపోలేను. మెరూన్ కలర్ జెర్సీ ధరించడం, దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడటం ఎప్పటికీ లైట్ తీస్కోను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌.. గేమ్‌కు సంబంధించిన ప్రతీదాంట్లో ఆత్మ పెట్టి ఆడాను'అని పొలార్డ్ ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

అయితే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటంపై మాత్రం పొలార్డ్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్‌లో పాల్గొనే ఈ కరేబియన్ ప్లేయర్.. ఆడుతానని, ఆడనని చెప్పలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పొలార్డ్.. అంచనాల మేరకు రాణించలేకపోతున్నాడు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు.అతని ఘోర వైఫల్యం టీమ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది.

ఇక వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్.. ఆ జట్టు తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. 2007లో సౌతాఫ్రికాతో వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పొలార్డ్.. బోర్డుతో విబేధాల కారణంగా 2014లో జట్టుకు దూరమయ్యాడు. 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు తీసిన పొలార్డ్.. 3 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు బాదాడు. టీ20ల్లో 1569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, April 20, 2022, 22:14 [IST]
Other articles published on Apr 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X