న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నకిలీ ధ్రువీకరణ పత్రం.. యువ క్రికెటర్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌

Mumbai Indians Pacer Rasikh Salam Suspended For Two Years ! || Oneindia Telugu
Kashmir Fast Bowler Rasikh Salam Banned For Two Years by BCCI For submitting faulty birth certificate


భారత యువ క్రికెటర్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌ పడింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్‌ యువ పేసర్‌ రసిక్‌ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది. దీంతో జులై 21 నుండి ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్‌-19 జట్టు నుంచి కూడా తప్పించింది. రసిక్‌ సలామ్‌నకు బదులుగా బెంగాల్‌కు చెందిన ప్రభాత్‌ మౌర్యను బీసీసీఐ ఎంపిక చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం'నకిలీ జనన ధ్రువీకరణ పత్రంను రసిక్‌ సమర్పించాడు. దీంతో అతనిపై రెండేళ్ల పాటు వేటు వేసాం' అని బీసీసీఐ మీడియా సమావేశంలో తెలిపింది. ఐపీఎల్‌-12 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు రసిక్‌ ఒక మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రసిక్‌ 42 పరుగులు ఇచ్చాడు. మొదటి స్పెల్ రసిక్‌ అద్భుతంగా వేసాడు. మూడు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఇనింగ్స్ చివరలో రిషబ్ పంత్ చెలరేగడంతో ఆ ఒక్క ఓవర్లోనే 21 పరుగులు సమర్పించుకున్నాడు.

ముంబై ఇండియన్స్‌ అతనిని బేస్ ప్రైస్ 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్‌ నుండి ఐపీఎల్‌కు ఎంపికయిన మూడో ఆటగాడు రసిక్‌ సలామ్‌. పర్వేజ్ రసూల్, మంజూర్ దార్ తర్వాత ఐపీఎల్‌ కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రసిక్‌ అనవసర వివాదంతో కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.

Story first published: Thursday, June 20, 2019, 9:55 [IST]
Other articles published on Jun 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X