న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్స్‌ కొడదామని: మూడో బంతికి సింగిల్‌ తీయకపోవడంపై కార్తీక్

Dinesh Karthik's Response On The 3rd T20 Defeat | Oneindia Telugu
Karthik says he was confident of hitting a six against New Zealand

హైదరాబాద్: సిక్స్‌ కొట్టగలనని నమ్మకంతోనే తాను మూడో బంతికి సింగిల్ కోసం ప్రయత్నించలేదని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న దినేశ్ కార్తీక్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తాను ఉన్నానంటూ జట్టుకు విజయాలందించడంలో ఎప్పుడు ముందుంటాడు.

<strong>'ప్రపంచకప్‌ ముందు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ ప్రయోగాలు చేయాలి'</strong>'ప్రపంచకప్‌ ముందు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ ప్రయోగాలు చేయాలి'

గతేడాది నిదాహాస్ ట్రోఫీ ద్వారా ధోనీ లాగా మ్యాచ్‌ను ముగించగల మంచి ఫినిషర్‌గా వెలుగులోకి వచ్చాడు. తాజాగా న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన ఆఖరి టీ20లో గెలవాలంటే టీమిండియాకు ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి తేలిగ్గా సింగిల్‌ వచ్చే అవకాశమున్నా దినేశ్‌ కార్తీక్‌ పరుగు తీయలేదు.

భారీ షాట్లు ఆడగలిగే కృనాల్‌ పాండ్యా పరుగెత్తుకుంటూ వచ్చినా.. దినేశ్ కార్తీక్‌ సింగిల్‌కు నిరాకరించడం చర్చనీయాంశమైంది. దీంతో పాండ్యాకు బ్యాటింగ్ ఇవ్వకుండా కార్తీక్ తప్పుచేశాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించిన నేపథ్యంలో వీటన్నింటికి దినేశ్ కార్తీక్ తాజాగా సమాధానమిచ్చాడు.

ఆఖరి ఓవర్లో భారత విజయానికి 16 పరుగులు

ఆఖరి ఓవర్లో భారత విజయానికి 16 పరుగులు

దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ "ఆఖరి ఓవర్లో భారత విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే సగం వికెట్లు కోల్పోయి ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉన్నా.. కృనాల్‌తో కలిసి నేను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాను. లక్ష్యాన్ని పూర్తి చేయగలమనే నమ్మకంతో ఉన్నాం. మూడో బంతికి కృనాల్‌కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించా. ఆ మరుసటి బంతినే సిక్స్ కొడుదామనుకుని గట్టి నమ్మకం పెట్టుకున్నా" అని అన్నాడు.

దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ

దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ

"కానీ అనుభవజ్ఞడైన టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎత్తులు పారలేదు. అంతేగానీ కృనాల్‌కు బ్యాటింగ్ ఇవ్వద్దనే ఆలోచన నాలోలేదు. ఇన్నింగ్స్ నిర్మించేందుకు మిడిలార్డర్‌లో చాలా సమయముంటుంది. ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల నా సామర్థ్యాన్ని నేను నమ్మాలి. అదే సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న సహచర బ్యాట్స్‌మన్‌ను నమ్మాలి. ఒక్కోసారి మన ప్రయత్నం ఫలిస్తుంది.. మరోసారి ఫెయిల్ అవుతాం" అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

హామిల్టన్ టీ20లో అదే జరిగింది

హామిల్టన్ టీ20లో అదే జరిగింది

"హామిల్టన్ టీ20లో అదే జరిగింది. నేను అనుకున్నట్లుగా ఆడలేకపోయా. మ్యాచ్ పరిస్థితి ఏంటో వారికి పూర్తిగా తెలుసు. ఇద్దరు కలిసి మ్యాచ్‌ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాం. ఒక్కోసారి బౌండరీ బాది జట్టును గెలిపిస్తే.. మరోసారి బౌలర్‌ది పైచేయి అవుతుంది. ఆ రోజు మ్యాచ్‌లో సౌథీ యార్కర్లు సంధించడంతో భారీ షాట్లు సాధ్యపడలేదు. క్రికెట్లో అలాంటివి జరగడం సహజం" అని దినేశ్ కార్తీక్ అన్నాడు.

మెరుగైన ప్రదర్శన వెనుక ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్

మెరుగైన ప్రదర్శన వెనుక ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్

పునరాగమనం తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం వెనుక ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్ ఉన్నాడంటూ దినేశ్ కార్తీక్ చెప్పాడు. "తాను ఈ స్థాయిలో నిలకడగా రాణించడంలో అతని మద్దతు వెలకట్టలేనిది. అభిషేక్, నేను కలిసి ఒత్తిడిలో ఎలా నెట్టుకు రావాలనే దానిపై చాలా చెమటోడ్చాం. వేర్వేరు రకాల వికెట్లపై రోజులకు రోజులు ప్రాక్టీస్ చేశాం. అందుకే మ్యాచ్ ఫినిషర్‌గా వెలుగులోకి వచ్చాను. ఎంత టి ఒత్తిడినైనా చిత్తు చేయగలనన్న నమ్మకం నాలో కలిగింది" అని కార్తీక్ అన్నాడు.

Story first published: Thursday, February 14, 2019, 11:59 [IST]
Other articles published on Feb 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X