'పంత్ ఎవరినీ నిందించలేడు.. అద్భుత ప్రదర్శనతో విమర్శకులకు సమాధానం చెప్పాలి'

Rishabh Pant 'Cannot Blame Anyone' For His Current Situation - Kapil Dev

ముంబై: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ఎంతో ప్రతిభ ఉంది. అతడు ఎవరినీ నిందించలేడు. పంత్ అద్భుత ప్రదర్శన చేసి విమర్శకులకు సమాధానం చెప్పాలని భారత మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ సూచించారు. మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్.. ఆరంభంలో బాగానే ఆడాడు. టెస్ట్, వన్డే, టీ20ల్లో పరుగులు చేసాడు. అయితే తనకు అలవాటైన షాట్‌తో పదేపదే ఔట్ అవుతూ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. మార్పుల్లేకుండానే బరిలోకి ఇరుజట్లు!!

పంత్‌ ఎవరినీ నిందించలేడు:

పంత్‌ ఎవరినీ నిందించలేడు:

టీమిండియా లెజండరీ కపిల్‌ దేవ్ శనివారం చెన్నైలో మాట్లాడుతూ... 'రిషబ్ పంత్‌కు ఎంతో ప్రతిభ ఉంది. అతడు ఎవరినీ నిందించలేడు. కెరీర్‌పై దృష్టిసారించాలి. అద్భుత ప్రదర్శన చేసి విమర్శకులకు సమాధానం చెప్పాలి. మీలో ప్రతిభ దాగి ఉంటే.. విమర్శకులు చేసే వ్యాఖ్యలు తప్పు అని నిరూపించాలి. ఆటగాళ్లు ఎప్పటికీ తమ గురించి తాము ఆలోచించుకోవాలి. జట్టులో నుంచి తప్పించే అవకాశాన్ని అసలు సెలక్టర్లకు ఇవ్వకూడదు' అని అన్నారు.

అది జట్టు యాజమ్యానం ఆలోచన:

అది జట్టు యాజమ్యానం ఆలోచన:

కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మూడు మ్యాచ్‌ల నుండి రిషబ్ పంత్‌ను తుది జట్టు నుంచి తప్పించి కేఎల్‌ రాహుల్‌తో వికెట్‌ కీపింగ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కపిల్ స్పందించారు. 'పంత్‌ను తప్పించడం, రాహుల్‌తో వికెట్‌ కీపింగ్ చేయించడం పూర్తిగా జట్టు యాజమ్యానం ఆలోచన. ఈ విషయం గురించి నాకు తెలియదు. అది నా నిర్ణయం కూడా కాదు. ఎవరు ఓపెనర్‌గా రావాలి?, ఎవరు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి?, కీపింగ్ ఎవరు చేయాలి అని జట్టు యాజమాన్యం నిర్ణయిస్తుంది' అని కపిల్‌ దేవ్ తెలిపారు.

బౌలర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి:

బౌలర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి:

'భారత్‌లో వాతావరణం, పరిస్థితులు ఎపుడూ సవాలుగా ఉంటాయి. ఏడాదికి పది నెలలు క్రికెట్‌ ఆడితే ఆటగాళ్లకు గాయాలు అవుతుంటాయి. గాయాల విషయంలో జట్టు యాజమాన్యం బౌలర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. హార్దిక్‌ పాండ్య పునరాగమనంపై ఆందోళన చెందుతున్నాడు. తొందరగా కోలుకుని జట్టులోకి రావాలని చూస్తున్నాడు. గాయాల నుండి త్వరగా కోలుకోవడం అంత సులువు కాదు. ఫిట్‌నెస్‌పై అతడు దృష్టి పెట్టాలి' అని కపిల్‌దేవ్‌ సూచించారు.

కీలక ఆటగాళ్లకు గాయాలు:

కీలక ఆటగాళ్లకు గాయాలు:

గాయాలతో భారత కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. మొదటగా హార్దిక్‌ పాండ్య.. ఆ తర్వాత భువనేశ్వర్‌ కుమార్, దీపక్‌ చాహర్.. ఇప్పుడు శిఖర్‌ ధావన్‌ జట్టుకు దూరమయ్యారు. రిషభ్‌ పంత్‌కు కూడా గాయమయినా (కంకషన్‌).. అతడు ప్రస్తుతం కోలుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, January 26, 2020, 13:23 [IST]
Other articles published on Jan 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X