న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనాతో జరిగే యుద్ధంలో ప్రపంచం గెలుస్తుంది: కపిల్ దేవ్

Kapil Dev on Coronavirus crisis: I know we will win this battle by being together

ముంబై: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మానవజాతి విజయం సాధించగలదని నమ్ముతున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. తాను ఎప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తానన్నారు. కరోనా సంక్షోభం నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని కపిల్ పేర్కొన్నారు. మహమ్మారితో ఇప్పటికే 5,30,000 మందికి పైగా వైరస్ బారిన పడగా.. 24,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధం: బెన్‌స్టోక్స్‌ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధం: బెన్‌స్టోక్స్‌

 చేతులు కడుక్కోవడం నేర్చుకోవాలి:

చేతులు కడుక్కోవడం నేర్చుకోవాలి:

తాజాగా కపిల్ దేవ్ 'ది హిందూ'తో మాట్లాడుతూ... 'ప్రజలు ఇప్పుడు పరిశుభ్రతకు సంబందించిన పాఠాలను గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం నేర్చుకోవాలి. బహిరంగంగా ఉమ్మివేయడం, మూత్ర విసర్జన లాంటివి చేయకూడదు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వారికి కరోనా జాగ్రత్తలను వివరించాలి. ప్రభుత్వంతో అందరూ సహకరించాలి' అని అన్నారు.

 కలిసికట్టుగా పోరాదాం:

కలిసికట్టుగా పోరాదాం:

'మేము గతంలో పాఠాలు నేర్చుకున్నాం. నా సీనియర్ల నుండి నేర్చుకోగలిగినందుకు నేను అదృష్టవంతుడిని. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ తరం తప్పులు చేయదని ఆశిస్తున్నా. సంక్షోభాలను ఎదుర్కొనేటప్పుడు మానవ జాతి ఎలా పోరాడిందో నేను చదివాను, విన్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. కలిసికట్టుగా పోరాడుదాం. భారతదేశం అతిపెద్ద బలం మన సంస్కృతి. ఒకరినొకరు చూసుకుంటూ ముందుకువెళదాం. సీనియర్లకు సహాయం చేయండి. ప్రభుత్వం మరియు వైద్యులు చెప్పినట్టు ఇంట్లోనే ఉంటే.. కరోనాపై చేసే యుద్ధంలో మనం విజయం సాధిస్తాం' అని కపిల్ ధీమా వ్యక్తం చేసారు.

 ఇంగ్లాండ్‌లో ఆడుతున్నప్పుడు నేర్చుకున్నా:

ఇంగ్లాండ్‌లో ఆడుతున్నప్పుడు నేర్చుకున్నా:

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో కపిల్ దేవ్ తన కుటుంబ సబ్యులకు ఎలా సాయం చేస్తున్నాడో కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇంగ్లాండ్‌లో ఆడుతున్న రోజుల్లో సొంతంగా జీవించడం నేర్చుకున్నానని కపిల్ చెప్పారు. 'నేను ఇంటిని, తోటను శుభ్రం చేస్తున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నా. గత కొన్నేళ్లుగా వంటకి విరామం ఇచ్చాను. కానీ.. ఇప్పుడు అందరికి మండుతున్నా. ఇవన్నీ ఇంగ్లాండ్‌లో ఆడుతున్నప్పుడు నేర్చుకున్నా' అని కపిల్ చెప్పుకొచ్చారు.

కపిల్ బయోపిక్:

కపిల్ బయోపిక్:

1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న నేపథ్యంతో '83' అనే సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే . క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ సింగ్.. క‌పిల్ దేవ్‌గా క‌నిపించ‌నున్నాడు. సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌ భాసిన్.. క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణిగా సాహిల్‌ ఖట్టర్, బల్వీందర్‌ సింగ్‌గా అమ్మీ విర్క్‌ కనిపించబోతున్నారు. ఇక రణ్‌వీర్‌కు జోడీగా దీపిక పదుకొణె రోమి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఏప్రిల్ 10న 83 చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌గా, క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీని మ‌రి కొద్ది రోజులు వాయిదా వేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Story first published: Friday, March 27, 2020, 11:02 [IST]
Other articles published on Mar 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X