న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kapil Dev's Opinion : ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌‌కు ముందు కోహ్లీ విషయంలో నేను చెప్పాలనుకుంటుందిదే..!

Kapil Dev Interesting Comments About Virat Kohli Comeback Ahead Of India vs Pakistan Match

ఈ రోజు క్రికెట్ అభిమానులకు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా భారత్ పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కోహ్లీ కమ్‌బ్యాక్‌లోకి రావడం. కోహ్లీ ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ కోహ్లీకి 100వ మ్యాచ్ కావడం.. అలాగే ఫాంలోకి రావడానికి సరైన మ్యాచ్ కావడం విశేషం. ఇక ఇటీవల వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక జట్టులో కోహ్లీ స్థానంపై భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విరామం జోలికి పోకూడదు

విరామం జోలికి పోకూడదు

ఆసియా కప్ 2022 కోహ్లీకి చివరి అవకాశమా అని ఓ విలేకరి కపిల్‌దేవ్‌ను అడగగా.. 'నేను అలా ఏం అనుకోను. అసలు మనం దాని గురించి ఆలోచించనే వద్దు. మనం కోహ్లీకి ఇదే చివరి అవకాశమా తదితర వ్యాఖ్యలనే వాడొద్దు. అది సరికాదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతూనే ఉండాలి. అదే నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను.

అతి విరామం కూడా పనికిరాదు. అతను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్. అతను ఫామ్ పుంజుకునేదాకా విరామం జోలికి పోకూడదు. అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడగలడని భావిస్తే అన్ని మ్యాచ్‌లు ఆడాలి అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అతను ఒక్కసారి ఫ్రీగా పరుగులు చేయడం ప్రారంభించినప్పుడు.. తప్పకుండా అతని బ్యాటింగ్ వ్యూ మారుతుంది' అని కపిల్ దేవ్ చెప్పాడు.

ఇది భారత క్రికెట్‌కు ఆరోగ్యకరం

ఇది భారత క్రికెట్‌కు ఆరోగ్యకరం

ఇకపోతే కపిల్ తన హయానికి భిన్నమైన వాతావరణం ప్రస్తుతం టీమిండియాలో ఉందని పేర్కొన్నాడు. ఈ రోజు ప్రభావవంతమైన ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అది జట్టుకు మంచిదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి సీనియర్లు విశ్రాంతి తీసుకున్నప్పుడు యువకులకు అవకాశం దొరుకుతుంది. సంజూ శాంసన్, దీపక్ హుడా, శుభ్‌మన్ గిల్ లాంటి వారు తమకు అవకాశాలొచ్చినప్పుడు మంచి ప్రభావవంతంగా ఆడారు. ఈ ప్రక్రియ ఇలాగే ముందుకు సాగాలని ఇది భారత క్రికెట్‌కు ఆరోగ్యకరమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడు చాలా మార్పు వచ్చింది

ఇప్పుడు చాలా మార్పు వచ్చింది

'ప్రస్తుతం టీంలో ఆ ప్లేయర్ కచ్చితంగా ఉండాలి లేకపోతే నడవదు అనే పరిస్థితి లేదు. ఈరోజు టీమ్‌లో ఎవరు లేరన్న తేడా లేదు. మా కాలంలో పెద్ద ఆటగాడు టీంలో ఉండాలి.. అతను ఆడాలి.. లేకుంటే అతనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కోహ్లీ, రోహిత్ లేదా అశ్విన్ లాంటి పెద్ద ప్లేయర్లు బెంచ్ ప్లేయర్లుగా ఉన్నా.. లేదా విశ్రాంతి తీసుకున్నా సరే.. బరిలోకి దిగే ఆటగాళ్లు అస్సలు భయం లేకుండా ఆడుతున్నారు. ఆటగాళ్ల ఆలోచనా విధానం చాలా బాగా మారింది. స్టార్లు లేరు కదా ఇప్పుడెలా అనే ధోరణి అసలే లేదు. జట్టులో ఎవరుంటారో వాళ్లే అత్యుత్తమంగా ఆటను చూసుకుంటున్నారు.' అని కపిల్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, August 28, 2022, 13:55 [IST]
Other articles published on Aug 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X