న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే శశాంక్‌ను పక్కనపెట్టి ప్రియామ్ గార్గ్‌ను తీసుకున్నాం: కేన్ విలియమ్సన్

Kane Williamson reveals reason why Priyam Garg Include Playing XI against MI

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో సన్‌రైజర్స్ రెండు కీలక మార్పులు చేసింది. శశాంక్, మార్కో జాన్సెన్‌లపై వేటు వేసి ఫజల్ ఫరూఖి, ప్రియామ్ గార్గ్‌లను తుది జట్టులోకి తీసుకొచ్చింది. అయితే టీమ్ ప్రణాళికల్లో భాగంగానే ఈ మార్పులు చేశామని సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ టాస్ సందర్భంగా తెలియజేశాడు. అభిషేక్ శర్మతో కలిసి ప్రియామ్ గార్గ్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో ఇన్ని రోజులు ఓపెనింగ్ చేసిన కేన్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు.

1
53674

ఇక తాము టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకునేవాళ్లమని కేన్ మామ చెప్పాడు. ఎందుకంటే మ్యాచ్ గెలవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవడం కూడా ముఖ్యమేనని తెలిపాడు. ఇది డ్రై వికెట్ అని చెప్పిన కేన్.. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచి, తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలనేది తమ ప్లాన్ అని పేర్కొన్నాడు.

టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్.. కండీషన్స్ నేపథ్యంలో ఫీల్డింగ్ తీసుకుంటున్నానని చెప్పాడు. ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకోవడంతో భవిష్యత్తుపై ఫోకస్ పెట్టామని తెలిపాడు. అందులో భాగంగానే గత మ్యాచ్ ఆడిన ఇద్దరు స్పిన్నర్లను తప్పించి మయాంక్ మార్కెండే, సంజయ్ యాదవ్‌లకు అవకాశం కల్పించామని చెప్పాడు. ఈ సీజన్‌లో మిగిలిన చివరి మ్యాచ్‌కు కూడా ఇదే ప్రణాళికలతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. జట్టు కోర్ బలాన్ని పరీక్షించడం తమకు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ప్రియామ్ గార్గ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫజల్సాక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డానియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, ట్రిస్టాన్ స్టబ్స్, టీమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, మయాంక్ మార్కండే

Story first published: Tuesday, May 17, 2022, 19:29 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X