న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీఎస్ఎల్: సరికొత్త రికార్డు సృష్టించిన కమ్రాన్ అక్మల్ (వీడియో)

By Nageshwara Rao
Kamran Akmal smashes fastest PSL half century

హైదరాబాద్: లాహోర్ వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్‌లో పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు లీగ్ మ్యాచ్‌లు యుఏఈలో జరగ్గా ప్లేఆఫ్స్‌కు లాహోర్ వేదిక అయిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా బుధవారం పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ మధ్య రెండవ ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్ విజృంభించాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

తద్వారా పీఎస్ఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కమ్రాన్ అక్మల్ మొత్తం 27 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. అక్మల్ రెచ్చిపోయి ఆడటంతో జల్మీ జట్టు 10 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.

దీంతో ఈ సీజన్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ ఆటగాడు ల్యూక్ రోంచీ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నెలకొల్పిన రికార్డును అక్మల్ బద్దలుగొట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ రోంచీ కూడా ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్‌పైనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ఫెషావర్ జల్మీ 13 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కరాచీ వేదికగా ఆదివారం (మార్చి 25)న ఇస్లామాబాద్, పెషావర్ జల్మీ జట్ల మధ్య పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Story first published: Thursday, March 22, 2018, 19:42 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X