న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయాబ్ మాలిక్ పట్ల ఎందుకింత వివక్ష.. పీసీబీని కడిగిపారేసిన మాజీ పాక్ కీపర్ కమ్రాన్ అక్మల్

Kamran Akmal Slams PCB As Shoaib Malik not in the Scheme Of T20 Team of Pakistan

వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ను పూర్తిగా విస్మరించి.. పక్కన పెడుతుండడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై భారత మాజీ వికెట్ కీపర్ కం బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సీరియస్ అయ్యాడు. మిగతా దేశాల్లో ఎక్కువ వయసున్న ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. వారిని ఆడించడానికి సంబంధిత క్రికెట్ బోర్డులు ఇప్పటికీ రెడీగా ఉంటున్నాయి.

రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన తర్వాత ఎంఎస్ ధోనీ ఇప్పటికీ ఐపీఎల్ ఆడట్లేదా.. అలాగే అలెస్టర్ కుక్ డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదా.. వాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతానంటే మళ్లీ ఆడించేందుకు ఆయా బోర్డులు ఇప్పటికీ రెడీ ఉన్నాయి.. కానీ మాలిక్ ఆడడానికి రెడీ ఉన్నా అతన్ని ఎందుకు పక్కనపెడుతున్నారు.. వయసు మాత్రమే మీకు ముఖ్యంగా అంటూ కమ్రాన్ పీసీబీని కడిగిపారేశాడు.

పాకిస్తాన్‌లో మాత్రమే వయస్సు విషయంలో ఎందుకింత సమస్యో నాకు అర్థం కాదు. షోయబ్ మాలిక్ ఫిట్‌గా లేడా.. లేక ఆడడానికి అనర్హుడా లేదా ఫామ్‌లో లేడా? ఎందుకని అతన్ని ఆడనివ్వట్లేదు. అతను పాకిస్థాన్‌ జట్టుకు ఆడటానికి తగినవాడా కాదా నాకు చెప్పండి..' అని అక్మల్ క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ సీరియస్ అయ్యాడు.

గత సంవత్సరం యూఏఈలో జరిగిన టీ20ప్రపంచ కప్‌లో జట్టులో ఉన్న మాలిక్.. ఆ తర్వాత జట్టుకు సెలెక్ట్ కాలేదు. ఇక మహమ్మద్ హఫీజ్ సైతం జట్టుకు సెలెక్ట్ కాకపోవడంతో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. హఫీజ్, సర్ఫరాజ్ ఖాన్, షోయాబ్ మాలిక్ లాంటి ప్లేయర్లు జట్టును వీడాక పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్‌ పేలవంగా మారిపోయింది. మాలిక్‌ను జట్టు మిడిలార్డర్లో ఉంచాల్సిందంటూ పాక్ మాజీలు కొందరు తమ విశ్లేషణలు అందిస్తూనే ఉన్నారు. ఏదేమైనా మాలిక్‌ను పాకిస్థాన్ పూర్తిగా పక్కన పెట్టినట్లు కన్పిస్తుంది.

Story first published: Monday, September 26, 2022, 15:50 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X